స్టార్ హీరో పవన్ కల్యాణ్ నటిస్తున్న కొత్త సినిమా ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్). ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. గ్యాంగ్స్టర్ కథతో యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతున్నది. ఇటీవల ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. పవన్ కల్యాణ్ షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ సినిమాలో నాయికగా ప్రియాంక మోహన్ ఎంపికైందని ఇప్పటికే వార్తలు రాగా…తాజాగా చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. ‘గ్యాంగ్ లీడర్’, ‘శ్రీకారం’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది ప్రియాంక. ముంబైలో ఈ నెలాఖరు వరకు షూటింగ్ చేయబోతున్నారు. ప్రధాన తారాగణం పాల్గొంటున్న ఈ షెడ్యూల్లో యాక్షన్ సీక్వెన్సులతో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : రవి కె చంద్రన్, సంగీతం : తమన్.