Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినిమాని అడ్డుకుంటున్న ఆ నలుగురు ఎవరు?
Pawan Kalyan | కొంత కాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతలకి, ఎగ్జిబిటర్స్‌కి అస్సలు పడడం లేదు. పర్సంటేజ్ సిస్టమ్‌లో సినిమాలు రిలీజ్ చేయాలని ఎగ్జిబిటర్స్ అంటుంటే, అలా చేస్తే మాకు తీరని నష్టం వస్తుందని నిర్మాతలు అంటున్నారు. ఈ క్రమంలో జూన్ 1వ తేదీ నుంచి సినిమా హాళ్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు.
Pawan Kalyan | కొంత కాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతలకి, ఎగ్జిబిటర్స్‌కి అస్సలు పడడం లేదు. పర్సంటేజ్ సిస్టమ్‌లో సినిమాలు రిలీజ్ చేయాలని ఎగ్జిబిటర్స్ అంటుంటే, అలా చేస్తే మాకు తీరని నష్టం వస్తుందని నిర్మాతలు అంటున్నారు. ఈ క్రమంలో జూన్ 1వ తేదీ నుంచి సినిమా హాళ్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు. దీని గురించి చర్చించేందుకు ఫిల్మ్ ఛాంబర్లో జరిగిన సంయుక్త రాష్ట్రాల ఎగ్జిబిటర్స్ మీటింగ్‌కు దాదాపు 60 మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. వారిలో సురేష్ బాబు, దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాతలు కూడా ఉన్నారు. మీటింగ్‌లో తమ సమస్యలని విన్నవించుకున్నారు ఎగ్జిబిటర్లు.
అయితే అద్దె ప్రాతిపదికన థియేటర్లు నడిపే పరిస్థితుల్లో తాము లేమని థియేటర్ యాజమాన్యం అంటుంది. అలా చేస్తే నష్టాలు వస్తున్నాయంటున్నాయని.. సినిమా నిర్మాతలు సహకరించి పర్సంటేజ్ విధానానికి అంగీకరించాలని వారు కోరారు.దీనిపై ఈ రోజు కూడా చర్చ జరగనుంది. అయితే బంద్ నిర్ణయం వెనుక కుట్ర ఉందని జన సేన ఆరోపిస్తుంది. పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా జూన్ 12 న విడుదల నేపద్యంలో ఆ నలుగురు కుట్ర చేశారంటూ తీవ్రంగా ఆరోపిస్తుంది జన సేన. అంతే కాదు దీని పై ఏకంగా విచారణకు ఆదేశించారు సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్. థియేటర్లు మూసి వేయాలనే ఒత్తిడి వెనుక దాగున్న కుట్రను వెలికి తీయాలంటూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్‌కు మంత్రి కందుల దుర్గేష్ ఫిర్యాదు చేశారు.
అయితే తెలుగులో అగ్ర నిర్మాతలుగా పేరున్న ఆ నలుగురు ఇటీవల ఒక చోట సమావేశం అయ్యారని, వారు పన్నిన కుట్రలో భాగమే థియేటర్ల మూసివేత అంటూ ఫిర్యాదులో రాసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆ నలుగురు ఎవరనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా సాగుతుంది. అయితే మల్టీప్లెక్స్ తరహాలోనే కలెక్షన్స్ లో పర్సెంటేజీ విధానాన్ని అమలు చేయాలంటూ సింగిల్ థియేటర్ల యాజమాన్యాలు డిమాండ్ చేస్తుండగా, మరి కొద్ది గంటలలో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో నిర్మాతలు చర్చలు జరపనున్నారు. ఈ సమావేశం తర్వాత థియేటర్ల బంద్‌పై తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇంతలోనే థియేటర్ల బంద్ నిర్ణయం పై విచారణ చేపట్టాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

