Vinodaya Sitham Remake | అప్పుడే వినోదయ సిత్తం టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న పవన్
Vinodaya Sitham Remake Movie | పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బ్యాక్ బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. పవన్ చేతిలో ప్రస్తుతం నాలుగు ప్రాజెక్ట్‌లున్నాయి. హరిహర వీరమల్లుతో పాటు వినోదయ సిత్తం రీమేక్, ఉస్తాద్ భగత్‌సింగ్, ఓజీ ఇలా నాలుగు సినిమాలు సెట్స్ మీదున్నాయి.
Vinodaya Sitham Remake Movie | పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బ్యాక్ బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. రానున్న ఎలక్షన్ల దృష్ట్యా ప్రస్తుతం సెట్స్ మీదున్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు. పవన్ చేతిలో ప్రస్తుతం నాలుగు ప్రాజెక్ట్‌లున్నాయి. ‘హరిహర వీరమల్లు’తో పాటు ‘వినోదయ సిత్తం’ రీమేక్, ‘ఉస్తాద్ భగత్‌సింగ్’, ‘ఓజీ’ ఇలా నాలుగు సినిమాలు సెట్స్ మీదున్నాయి. ఇక ఇటీవలే పవన్.. హరిహర వీరమల్లుకు కాస్త బ్రేక్ ఇచ్చి సముద్రఖనితో వినోదయ సిత్తం రీమేక్‌ను స్టార్ట్ చేశాడు. సాయిధరమ్ తేజ్ మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నాడు.

ఈ సినిమాలో పవన్ దాదాపు 40 నిమిషాలు కనిపించనున్నాడు. కాగా తాజాగా పవన్‌కు సంబంధించిన షూటింగ్ పూర్తయినట్లు చిత్ర దర్శకుడు సముద్రఖని వెల్లడించాడు. సోషల్ మీడియాలో థ్యాంక్యూ గాడ్, పవన్ కళ్యాణ్ సార్‌కు సంబంధించిన షూటింగ్‌ను సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేశాము. జూలై 28న థియేటర్లో కలుద్దాం అంటూ పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. ఇంత త్వరగా షూటింగ్ పూర్తవడంతో అటు పవన్ ఫ్యాన్స్ ఇటు ప్రేక్షకులు షాక్‌కు గురవుతున్నారు.

ఈ సినిమాలో పవన్‌కల్యాణ్ మానవ రూపంలో ఉన్న దేవుడి పాత్రలో కనిపిస్తారు. ప్రమాదంలో మరణించిన ఓ యువకుడికి దేవుడు పునర్జన్మ ప్రసాదిస్తే అతడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే ఈ సినిమా కథ. యువకుడిగా సాయిధరమ్ తేజ్ నటించనున్నాడు. పేరుకు తమిళ రీమేక్ అయినా.. త్రివిక్రమ్ తెలుగు నెటీవిటీకి తగ్గట్లు చాలా మార్పులు చేశాడన్నది వినికిడి. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

