Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి మూడు దశాబ్దాలు పూర్తయ్యాయి. తనదైన నటన, ప్రత్యేకమైన శైలి, విభిన్నమైన మేనరిజంతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన.. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి మూడు దశాబ్దాలు పూర్తయ్యాయి. తనదైన నటన, ప్రత్యేకమైన శైలి, విభిన్నమైన మేనరిజంతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన.. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి సినిమా జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.
పవన్ కళ్యాణ్ 1996లో విడుదలైన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో కథానాయకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆయన ‘కళ్యాణ్ బాబు’ పేరుతో నటించారు. అక్కినేని కుటుంబానికి చెందిన సుప్రియ యార్లగడ్డ ఈ సినిమాతో కథానాయికగా పరిచయమయ్యారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.1996 అక్టోబర్ 11న విడుదలైన ఈ సినిమా ద్వారా ప్రారంభమైన పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణం ఇప్పుడు మూడు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అల్లు అరవింద్ తమ తొలి సినిమా అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ పవన్‌కు అభినందనలు తెలిపారు.
పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి అల్లు అరవింద్ తన సందేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరూ కలిసి పనిచేసిన తొలి సినిమా విడుదలై 30 ఏళ్లు పూర్తయ్యాయంటే నమ్మలేకపోతున్నానని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణం అద్భుతంగా సాగిందని ప్రశంసిస్తూ, ఈ మైలురాయిని చేరుకున్న సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ఎంచుకునే ప్రతి మార్గంలో మరిన్ని విజయాలు సాధించాలని, సంతృప్తికరమైన ప్రయాణాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. ఆయనకు తన శుభాకాంక్షలు, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని అల్లు అరవింద్ పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ సినిమాల్లో సాధించిన గుర్తింపుతో పాటు సమాజం పట్ల ఆయనకు ఉన్న దృక్పథాన్ని కూడా అల్లు అరవింద్ తన సందేశంలో ప్రస్తావించారు. సినిమాలకు అతీతంగా సమాజానికి ఆయన అందిస్తున్న సేవలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ సినీ రంగంలోకి అడుగుపెట్టిన తొలి రోజుల్లోనే అభిమానుల్లో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. కాలక్రమేణా ఆయనకు ఉన్న ఆదరణ మరింత పెరిగింది. ప్రస్తుతం సినిమాలు, రాజకీయ బాధ్యతలతో కొనసాగుతున్న ఆయన ప్రయాణం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

