పవన్‌కల్యాణ్, సాయిధరమ్‌తేజ్ కలయికలో రూపొందిన చిత్రం ‘బ్రో’. సముద్రఖని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా ఈ చిత్రం సక్సెస్‌మీట్‌ను సోమవారం నిర్వహించించారు. సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మా మావయ్యతో కలిసి నటించే అవకాశం ఇచ్చింది. ఈ సందర్భంగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సముద్రఖని దర్శకుడిగా ఈ చిత్రంతో మరో మెట్టు ఎదిగాడు. పవన్ కళ్యాణ్ గురించి చెప్పే స్థాయి నాకు లేదు. నా ఆరోగ్యం బాగ లేకపోవడంతో దర్శకుడు త్రివిక్రమ్ నాకోసం సముద్రఖనితో సంవత్సరం పాటు వెయిట్ చేయించాడు.
ఈ రోజు సినిమా గొప్ప విజయం సాధించడం ఆనందంగా వుంది’ అన్నారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ ‘పవన్‌కళ్యాణ్‌తో సినిమా చేసే అవకాశం రావడం మాకు టైమ్ కలిసి వచ్చిందనే అనుకుంటున్నాం. ఈ చిత్రం ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ రోజు ప్రేక్షకుల ఆదరణ పొందడానికి కారణం త్రివిక్రమ్ రచన, సముద్ర ఖని దర్శకత్వ ప్రతిభ. సాధారణంగా నేను ఏ సినిమా చేస్తున్న మధ్యలో ఫోన్ చూడటం అలవాటు. కానీ ఈ సినిమా చూస్తున్నప్పుడు సినిమా పూర్తయ్యే వరకు ఫోన్ పక్కన పెట్టేశాను’ అన్నారు.