Pawan Kalyan Divorce | 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు.. విడిపోతున్నామని పవన్ కల్యాణ్, అన్నా సంయుక్త ప్రకటన
Pawan Kalyan Divorce | ఏపీ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్ కల్యాణ్ వివాహ బంధానికి ముగింపు పలికారు. పరస్పర అంగీకారంతో అన్నా లెజినోవాతో విడిపోతున్నట్టు ప్రకటించారు. సోమవారం రాత్రి ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ఓ స్టేట్మెంట్ వైరలైంది.
Pawan Kalyan Divorce | హైదరాబాద్, నవంబర్ 9(నమస్తే తెలంగాణ) : ఏపీ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్ కల్యాణ్ వివాహ బంధానికి ముగింపు పలికారు. పరస్పర అంగీకారంతో అన్నా లెజినోవాతో విడిపోతున్నట్టు ప్రకటించారు. సోమవారం రాత్రి ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ఓ స్టేట్మెంట్ వైరలైంది. జనసేన మీడియా వాట్సాప్ గ్రూపులో ఈ ప్రకటన విడుదల చేసినట్టు తెలిసింది. 13 ఏండ్ల వివాహ బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్టు పవన్, అన్నా లెజినోవా సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని, అయినప్పటికీ మంచి స్నేహితులుగా కొనసాగుతామని, తమ పిల్లల పట్ల అంకితభావం గల తల్లిదండ్రులుగా బాధ్యతలు నిర్వర్తిస్తామని ప్రకటించారు.
పరస్పర గౌరవంతో విడిపోవాలని నిర్ణయం
సోమవారం అర్ధరాత్రి విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల తమ నిర్ణయాన్ని వెల్లడించారు. జీవితంలో ఒక ముఖ్యమైన భాగాన్ని కలిసి ప్రయాణించిన తాము.. ఇప్పుడు పరస్పర అవగాహన, గౌరవంతో వేర్వేరు దారుల్లో వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. భార్యాభర్తలుగా తమ బంధం ముగిసినప్పటికీ మంచి స్నేహితులుగా కొనసాగుతామని స్పష్టం చేశారు. అలాగే తమ పిల్లల పట్ల తల్లిదండ్రులుగా బాధ్యతలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. పిల్లల సంతోషం, సంక్షేమమే తమ ఇద్దరికీ ఎప్పటికీ అత్యంత ముఖ్యమైన అంశమని వెల్లడించారు. ఈ వ్యక్తిగత పరిణామంలో తమ గోప్యతను గౌరవించాలని అభిమానులు, శ్రేయోభిలాషులను కోరారు. ఇన్నాళ్లూ తమకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్?
పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల విడిపోవడానికి గల కారణాలను సంయుక్త ప్రకటనలో వెల్లడించలేదు. పిల్లల సంరక్షణ, ఇతర ఏర్పాట్ల గురించి కూడా ఎలాంటి వివరాలు పేర్కొనలేదు. అయితే, జనసేన పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. గత కొన్ని నెలలుగా వీరిద్దరి మధ్య ఈ విషయంపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్న వీరిద్దరూ ఇప్పటికే ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
పవన్ కల్యాణ్‌కు ఇది మూడో వివాహం
పవన్ కల్యాణ్ తొలుత 1997లో విశాఖపట్నానికి చెందిన నందినిని వివాహం చేసుకున్నారు. 1999లో వీరిద్దరూ విడిపోయినప్పటికీ.. 2008లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నటి రేణు దేశాయ్‌ను వివాహం చేసుకున్నారు. అయితే, 2011లో వీరిద్దరూ విడిపోయి.. 2012లో విడాకులు తీసుకున్నారు. అనంతరం 2013లో అన్నా కొణిదెలను పవన్ కల్యాణ్ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు పోలేనా అంజనా పవనోవా, మార్క్ శంకర్ పవనోవిచ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు అన్నా కొణిదెలతోనూ విడిపోవాలని నిర్ణయించుకోవడంతో పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pawan Kalyan Divorce | 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు.. విడిపోతున్నామని పవన్ కల్యాణ్, అన్నా సంయుక్త ప్రకటన
Horoscope | 10-11-2026 మంగళవారం.. మీ రాశి ఫలాలు
ప్రతి సెంటర్‌కూ అబ్జర్వర్
సర్కార్ సైలెన్స్ సాస్.. బక్వాస్.. మియాపూర్‌లో బీరాలు.. ఖాజాగూడలో బేరాలా?
సాఫ్ట్వేర్ అప్డేట్తో ‘ఉపాధి’కి గండి!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

