Parineeti-Raghav Chadha | బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా త్వరలో పెళ్లితో ఒకటికాబోతున్నారు. ఇప్పటికే ఇద్దరు ఎంగేజ్మెంట్ గ్రాండ్‌గా జరిగింది. త్వరలో పెళ్లి పీటలెక్కనుండగా.. ఇద్దరు కలిసి ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకున్నారు. పరిణీతి చోప్రా మహాకాళేశ్వరుడికి భక్తురాలని ఆలయ పూజారి పండిట్ యష్ గురు తెలిపారు. 2022లో డిసెంబర్ 26న మహాకాళేశ్వరుడి భస్మ హారతిలో పాల్గొన్నది. పెళ్లికి ముందు కాబోయే భర్త, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాతో కలిసి శనివారం ఉజ్జయినికి చేరుకున్నది. ఆలయంలోని నందిహాల్లో శ్రీసూక్త పారాయణంతో మహాకాళేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసినట్లు యష్ గురు పేర్కొన్నారు.
పరిణీతి చోప్రా చీరలో, రాఘవ్ చద్దా కుర్తా పూజామాలో మెరిసిపోయారు. పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా సెప్టెంబర్ 25న పెళ్లితో ఏకం కాబోతున్నారు. ఈ క్రమంలో ఇద్దరు మహాకాళేశ్వరుడిని దర్శించుకొని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉండగా.. బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా నిశ్చితార్థం మే 13న ఢిల్లీలో జరిగింది. కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. చాలారోజులు ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఇద్దరు కలిసి ఓ హోటల్ డిన్నర్ డేట్‌కు వచ్చిన సమయంలో ఇద్దరు ప్రేమ విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్‌లో రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా చదివారు. కామన్ స్నేహితుల ద్వారా ఇద్దరి మధ్య పరిచయం మరింత పెరిగి.. అది కాస్త ప్రేమగా మారింది. చివరకు పెళ్లిబంధంతో ఒకటికాబోతున్నారు.