Family Star | టైం స్క్వేర్‌పై ఫ్యామిలీ స్టార్ గ్లింప్స్.. విజయ్ దేవరకొండ క్రేజ్‌కు ఫిదా
Family Star | టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఫ్యామిలీ స్టార్ (Family Star). రీసెంట్గా లాంఛ్ చేసిన ఫ్యామిలీ స్టార్ టైటిల్ లుక్, గ్లింప్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫ్యామిలీ స్టార్‌లో బాలీవుడ్ భామ మృణాళ్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తోంది.
Family Star | టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఫ్యామిలీ స్టార్ (Family Star). VD13గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి పరశురాం (Parasuram) దర్శకత్వం వహిస్తున్నాడు. మేకర్స్ రీసెంట్గా లాంఛ్ చేసిన ఫ్యామిలీ స్టార్ టైటిల్ లుక్, గ్లింప్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫ్యామిలీ స్టార్‌లో బాలీవుడ్ భామ మృణాళ్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్ చిచ్చుబుడ్డి వెలిగిస్తున్న లుక్ షేర్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ చిత్రాన్ని 2024 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్టు ప్రకటించారని తెలిసిందే. తాజాగా న్యూయార్క్ టైం స్వ్కేర్ బిల్డింగ్‌పై ఫ్యామిలీ స్టార్ గ్లింప్స్ స్క్రీనింగ్ అవుతోంది. మూవీ లవర్స్ అంతా న్యూయార్క్ వీధుల్లోకి చేరి ఫ్యామిలీ స్టార్ గ్లింప్స్‌ను చూస్తూ సందడి చేశారు. ఇప్పుడీ విజువల్స్ వైరలవుతున్నాయి. షూటింగ్ దశలో ఉన్నఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. ఇది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో వస్తున్న 54వ ప్రాజెక్ట్.
ఫ్యామిలీ స్టార్ టీజర్లో లైన్లో నిలబడి ఉల్లిపాయలు తేవడం.. టైంకు లేచి పిల్లలను రెడీ చేసి స్కూల్ పంపించడమనుకున్నావా.. సెటిల్మెంట్ అంటే..? అంటే అని అజయ్ ఘోష్ అంటుంటే.. భలే మాట్లాడతారన్నా మీరంతా.. ఏ ఉల్లిపాయలు లైన్లో నిలబడి కొంటే వాడు మనిషి కాదా..పిల్లలను రెడీ చేస్తే వాడు మగాడు కాదా.. ఐరనే వంచాలా ఏంటీ..? కొబ్బరికాయ తేవడం మర్చిపోయా.. తలకాయ కొట్టేశా అంటూ విజయ్ దేవరకొండ సింపుల్, స్టైలిష్‌గా చెబుతున్న మాస్ డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
ఫ్యామిలీ స్టార్ లుక్ వైరల్..
From our family to yours, Happy Diwali.
To extend the festivities beyond this holiday season, first single of #FamilyStar is coming very soon.@TheDeverakonda @Mrunal0801 @ParasuramPetla #KUMohanan @GopiSundarOffl @SVC_official @TSeries @tseriessouth pic.twitter.com/X2j3esalli
— Sri Venkateswara Creations (@SVC_official) November 12, 2023
Aaaaaand….We join the madness !!! 😄
Here is our official poster for the hottest statement this year!🔥#Airanevanchalaenti#FamilyStar pic.twitter.com/btkdoRyBuC
— Sri Venkateswara Creations (@SVC_official) October 26, 2023
ఫ్యామిలీ స్టార్ గ్లింప్స్..
VD 13 లాంఛింగ్ స్టిల్స్..
The much awaited collaboration of THE #VijayDeverakonda, @parasurampetla, & @svc_official’s #VD13 is officially launched today.
The talented @mrunal0801 joins the stellar cast.
Shoot begins soon.#SVC54@Thedeverakonda#KUMohanan @GopiSundarOffl #VasuVarma #DilRaju #Shirish pic.twitter.com/ZzOfigIvme
— Sri Venkateswara Creations (@SVC_official) June 14, 2023
The shoot of our #VD13 #SVC54 kick started today!🤩
Promising you a perfect entertainer for Sankranthi 2024.❤️🔥@TheDeverakonda #MrunalThakur @ParasuramPetla #KUMohanan @GopiSundarOffl @SVC_official pic.twitter.com/wEBkpqDROv
— Sri Venkateswara Creations (@SVC_official) July 15, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

