సుధీర్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘హంట్’. మహేష్ దర్శకుడు. శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ భరత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వి.ఆనంద ప్రసాద్ నిర్మాత. ఈ చిత్రంలోని ‘పాపతో పైలం’ అనే లిరికల్ వీడియోను ఇటీవల విడుదల చేశారు. సుధీర్‌బాబుతో పాటు అప్సరా రాణి నర్తించిన ఈ పాటకు యశ్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించగా, జిబ్రాన్ సంగీత దర్శకత్వంలో మంగ్లీ, నకాష్ ఆజీజ్ ఆలపించారు. నిర్మాత మాట్లాడుతూ ‘ ఇదొక ైస్టెలిష్ యాక్షన్ థ్రిల్లర్. సుధీర్‌బాబు పాత్ర అందరిని ఆకట్టుకునే విధంగా వుంటుంది’ అన్నారు.