వివేక్ దండు, సంగీర్తన విపిన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్’. గ్రామీణ నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి సి.హెచ్.రవికిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకొని సినిమాలోని తొలిపాట ‘మెగాసాంగ్’ను రిలీజ్ చేశారు.
ఈ సినిమాలో హీరో మెగా క్రామేడ్స్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కనిపించనున్నారు. ఫ్యాన్స్ చెప్పే స్లోగన్స్ కలబోతగా ఈ పాటను రూపొందించారు. ‘బాసుకు దండేసి బొట్టుపెట్టరా, దుమ్ము లేసి పోద్ది చూడు జాతరా’ వంటి లైన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎల్.రాజా, నిర్మాత: పి.వివేకానంద్ వర్మ.