ప్రేమలోకంలో విహారం

‘ప్రేమ ఔన్యత్యాన్ని చాటిచెప్పే ఆహ్లాదభరిత చిత్రమిది. టీమ్ అందరం ప్రేమతో ఇష్టపడి, కష్టపడి ఈ సినిమా చేశాం’ అని అన్నారు విశ్వక్సేన్. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘పాగల్’. నరేష్ కుప్పిలి దర్శకుడు. దిల్రాజు సమర్పణలో బెక్కెం వేణుగోపాల్ నిర్మించారు. నివేదా పేతురాజ్, సిమ్రాన్చౌదరి కథానాయికలు. ఈ నెల 14న విడుదలకానుంది. మంగళవారం హైదరాబాద్లో చిత్రబృందం ట్రైలర్ను విడుదలచేసింది. ఈ సందర్భంగా విశ్వక్సేన్ మాట్లాడుతూ ‘థియేటర్స్ పరంగా అనేక సమస్యలున్నా రిస్క్ చేస్తూ ధైర్యంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. మా అందరికంటే రెండింతలు ఎక్కువగా దిల్రాజు ఈ సినిమాను నమ్మారు. ప్రేమ గురించి చెప్పే కథ ఇది. అంతర్లీనంగా మదర్ సెంటిమెంట్ ఉంటుంది. నా మాతృమూర్తిగా భూమిక ఈ సినిమాలో కనిపిస్తుంది’ అని తెలిపారు. దిల్రాజు ఇచ్చిన ధైర్యం, ప్రోత్సాహంతోనే ఈ సినిమాను విడుదల చేస్తున్నామని నిర్మాత బెక్కెం వేణుగోపాల్ అన్నారు. అందరినీ ప్రేమ లోకంలో విహరింపజేసే చిత్రమిదని నివేదా పేతురాజ్ చెప్పింది. ఈ కార్యక్రమంలో మేఘలేఖ, రాజు, గెటప్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

