పాగల్ ట్రైలర్‌తో పిచ్చెక్కిస్తున్న మాస్ కా దాస్

‘ఫలక్‌నుమాదాస్’, ‘హిట్’ చిత్రాలతో మాస్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇప్పుడు పాగల్ అనే చిత్రం చేస్తున్నాడు.ఇందులో లవర్ బోయ్‌గా కనిపించి అలరించనున్నాడు. నరేశ్ కొప్పిలి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుండగా, మేకర్స్ ప్రమోషనల్ కార్యక్రమాలు వేగవంతం చేశారు.ఇటీవల ‘గూగులు గూగులు గూగులు.. గర్ల్‌ఫ్రెండ్‌ని వెతికే గూగులు.. వీడు పాగలు పాగలు పాగలు.. ప్రేమ కోసం వెతికే పాగలు’ అంటూ సాగే లిరికల్ పాట విడుదల చేయగా,దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ఇది సినిమాపై ఆసక్తిని కలిగిస్తుంది. విశ్వక్ సేన్ లుక్ కూడా ఆకట్టుకునేలా ఉంది. ఏ అమ్మాయికి పడితే ఆ అమ్మాయికి ప్రపోజ్ చేస్తూ సిల్లీ లవర్ బాయ్ లా మంచి ఫన్ ని కూడా పుట్టించాడు. నివేతా పెథురాజ్ తో మంచి ఎమోషన్స్ పండించింది. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈచిత్రంలో ఈనగరానికి ఏమైంది ఫేమ్ సిమ్రాన్ చౌదరి కూడా కనిపిస్తుంది.
దిల్ రాజు సమర్పణలో వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, రాధన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాపై విశ్వక్ సేన్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఈ సినిమా విజయం సాధిస్తే విశ్వక్ సేన్ కెరియర్‌కి చాలా హెల్ప్ అవుతుందని ఆయన అభిమానులు కూడా భావిస్తున్నారు. మరికొద్ది రోజులలో థియేటర్స్‌లో విడుదల కానున్న పాగల్ చిత్రం ఎంతగా ప్రేక్షకులని అలరిస్తుందో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

