OTT Movies | ఐపీఎల్ 2026 సీజన్ ముగియడంతో క్రికెట్ అభిమానుల దృష్టి ఇప్పుడు మళ్లీ సినిమాలు, వెబ్ సిరీస్‌లపై పడింది. గత రెండు నెలలుగా సాయంత్రం వేళలను క్రికెట్‌కు కేటాయించిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థలు భారీ చిత్రాలు, ఆసక్తికరమైన సిరీస్‌లతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.
ఈ వారం ముఖ్యంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ చిత్రం ‘ధురంధర్: ది రివెంజ్’ డిజిటల్ స్ట్రీమింగ్కు రానుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. థియేటర్లలో సంచలన విజయాన్ని నమోదు చేసిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధురంధర్: ది రివెంజ్’ ఈ ఏడాది అతిపెద్ద బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించి రికార్డులు సృష్టించింది. ఇప్పటికే విదేశీ మార్కెట్లలో నెట్‌ఫ్లిక్స్ ద్వారా స్ట్రీమింగ్ అయిన ఈ సినిమా, ఇప్పుడు భారత ప్రేక్షకుల ముందుకు రానుంది.
జూన్ 4న రాత్రి 7 గంటల నుంచి జియో హాట్‌స్టార్ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది.
మలయాళ సూపర్స్టార్లు మమ్ముట్టి, మోహన్‌లాల్ కలిసి నటించిన దేశభక్తి ప్రధాన యాక్షన్ థ్రిల్లర్ ‘పేట్రియాట్’ కూడా ఈ వారం ఓటీటీలోకి అడుగుపెడుతోంది. నయనతార, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం థియేటర్లలో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపకపోయినా, ఓటీటీలో మంచి స్పందన దక్కుతుందని మేకర్స్ ఆశిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 5 నుంచి జీ5 ప్లాట్‌ఫార్మ్‌లో తెలుగు సహా పలు భారతీయ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు ధ్రువ్ సర్జా హీరోగా నటించిన ‘కేడీ: ది డెవిల్’ కూడా ఈ వారమే ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సంజయ్ దత్, శిల్పా శెట్టి కీలక పాత్రలు పోషించారు.
ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కన్నడ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇప్పుడు జూన్ 5 నుంచి జీ5లో కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
మా బెహన్ (హిందీ మూవీ) – జూన్ 4
29 (తెలుగు/తమిళ మూవీ) – జూన్ 5
ఆఫీస్ రొమాన్స్ (మూవీ) – జూన్ 5
ది బ్లడ్ సిస్టర్స్ – జూన్ 5
ది మార్క్డ్ ఉమెన్ – జూన్ 5
మెక్సికో 86 – జూన్ 5
ది లెజెండ్ ఆఫ్ ఓక్స్ మెషీనా – జూన్ 3
క్లార్క్సన్స్ ఫార్మ్ సీజన్ 5 – జూన్ 3
ఓటీటీ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్
ఐపీఎల్ ముగిసిన వెంటనే ఓటీటీలు భారీ కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాయి. యాక్షన్, థ్రిల్లర్, దేశభక్తి కథలు, రొమాంటిక్ ఎంటర్టైనర్స్, వెబ్ సిరీస్‌లు ఇలా అన్ని రకాల జానర్లలో కంటెంట్ అందుబాటులోకి వస్తుండటంతో ఈ వారం ఓటీటీ ప్రియులకు పూర్తి స్థాయి వినోదం ఖాయం కానుంది.