OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
OTT Movies | సినిమా అభిమానులకు ఈ వారం థియేటర్లతో పాటు ఓటీటీల్లోనూ వినోదం అందనుంది. అక్టోబర్ చివరి వారంలో వెంకటేశ్–త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’తో పాటు విశ్వక్ సేన్ ‘కల్ట్’, ‘కిల్లర్’, ‘చంద్రయాన్’ వంటి సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి.
OTT Movies | సినిమా అభిమానులకు ఈ వారం థియేటర్లతో పాటు ఓటీటీల్లోనూ వినోదం అందనుంది. అక్టోబర్ చివరి వారంలో వెంకటేశ్–త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’తో పాటు విశ్వక్ సేన్ ‘కల్ట్’, ‘కిల్లర్’, ‘చంద్రయాన్’ వంటి సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. మరోవైపు ఓటీటీల్లో ప్రేమకథలు, హారర్, క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్లతో పాటు పలు వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్కు సిద్ధమవుతున్నాయి. అక్టోబర్ 26 నుంచి 30 వరకు ఏయే సినిమాలు, సిరీస్‌లు ఏయే వేదికల్లో అందుబాటులోకి రానున్నాయో తెలుసుకుందాం.
ఈ వారం ప్రత్యేకంగా రానున్న తెలుగు సినిమాలు
1. తెల్లకాగితం
‘కోర్ట్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న హర్ష్ రోషన్, నక్షత్ర ప్రధాన పాత్రల్లో నటించిన ప్రేమకథా చిత్రం ‘తెల్లకాగితం’. రమేష్ బండ్రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో మిశ్రమ స్పందనను సొంతం చేసుకుంది. ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈటీవీ విన్లో అక్టోబర్ 29 నుండి ఈ మూవీ స్ట్రీమ్ కానుంది.
2. ఎస్సై యుగంధర్
యువ కథానాయకుడు ఆది సాయికుమార్ నటించిన క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎస్సై యుగంధర్’. రాఘవేంద్ర కటారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం పోలీసు విచారణ, నేరాల చుట్టూ సాగే కథాంశంతో రూపొందింది. నెట్‌ఫ్లిక్స్ లో అక్టోబర్ 30 నుండి స్ట్రీమ్ కానుంది.
3. ఇమ్మోర్టల్
సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్ కుమార్, కయాదు లోహర్ ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ ‘ఇమ్మోర్టల్’. ప్రేమ, భయం, ఉత్కంఠ కలగలిసిన ఈ చిత్రం పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సోనీ లివ్‌లో అక్టోబర్ 30 నుండి తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషలలో స్ట్రీమ్ కానుంది.
4. బత్తా
తమిళ నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన కామెడీ డ్రామా ‘బత్తా’. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్ లో అక్టోబర్ 29 నుండి తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో స్ట్రీమ్ కానుంది.
నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబర్ 26 నుంచి 30 వరకు పలు అంతర్జాతీయ చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు, డాక్యుమెంటరీలు అందుబాటులోకి రానున్నాయి. అందులో భాగంగా అక్టోబర్ 26న మినిమమ్ వేజ్- ఆంగ్ల సిరీస్, అక్టోబర్ 27 ద వన్ అబౌట్ మాథ్యూ పెర్రీ – ఆంగ్ల డాక్యుమెంటరీ, అక్టోబర్ 28న దిండోరా సీజన్ 1 – హిందీ సిరీస్, అక్టోబర్ 29న బలారా: ద బ్లడ్ ఐలాండ్, బత్తా, యూ, మీ, అజ్, అక్టోబర్ 30న అక్క, అవరచన్ అండ్ బాయ్స్, ఎస్సై యుగంధర్, సిగ్మా, హౌ టు రూయిన్ దివాలీ, ఏ కపుల్ ఆఫ్ లైస్, ద బర్త్‌డే గిఫ్ట్, కొలిజన్ కోర్స్, డెడ్ ఎండ్ జాబ్, మీథే మే క్యాన్ హై, అబ్సెస్ స్ట్రీమింగ్ కానున్నాయి.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వారంలో రెండు ఆంగ్ల చిత్రాలు స్ట్రీమింగ్కు రానున్నాయి. అక్టోబర్ 28న డ్రైవ్: ద ప్రెటెండర్స్ స్ట్రీమింగ్ కానున్నాయి. అక్టోబర్ 30న అపోకలిప్స్ జెడ్: న్యూ వరల్డ్, జియో హాట్‌స్టార్ లో అక్టోబర్ 30న లవ్ ఆల్వేస్ – తెలుగు డబ్బింగ్ సిరీస్; అబ్సెసన్- ఆంగ్ల చిత్రం, జీ5లో అక్టోబర్ 30న రుద్రవనం పీఎస్- థ్రిల్లర్ సిరీస్; హాస్టల్ హద్సా – హిందీ సిరీస్, సోనీ లివ్‌లో అక్టోబర్ 30న ఇమ్మోర్టల్ – తెలుగు డబ్బింగ్ చిత్రం, ఈటీవీ విన్లో అక్టోబర్ 29న తెల్లకాగితం- తెలుగు చిత్రం, ఆపిల్ టీవీ ప్లస్‌లో అక్టోబర్ 30న నోక్టర్న్- ఆంగ్ల సిరీస్ స్ట్రీమ్ కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Amazon
- netflix
- October
- OTT Movies
RELATED ARTICLES
తాజా వార్తలు
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

