అరుదైన గౌరవం
ఆర్ఆర్ఆర్' చిత్రం ద్వారా ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు అగ్ర హీరో రామ్‌చరణ్. తాజాగా ఆయన ఓ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు.
‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ద్వారా ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు అగ్ర హీరో రామ్‌చరణ్. తాజాగా ఆయన ఓ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ప్రతిష్టాత్మక ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్‌లో సభ్యత్వం పొందారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో సీతారామరాజు పాత్రలో అద్భుతాభినయాన్ని ప్రదర్శించినందుకుగాను ఆయనకు స్థానం దక్కింది. ఆస్కార్ అవార్డుల కమిటీ ఇటీవల యాక్టర్స్ బ్రాంచ్‌లో కొత్త సభ్యులను చేర్చుకుంది. ప్రపంచ సినిమాలో ప్రముఖ నటీనటులు చోటు దక్కించుకున్నారు. తాజాగా ఇందులో రామ్‌చరణ్ జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని ఆస్కార్ కమిటీ తన సోషల్‌మీడియా ఖాతా ద్వారా పంచుకుంది. రామ్‌చరణ్‌తో పాటు కొంతమంది హాలీవుడ్ నటులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఈ యాక్టర్స్ బ్రాంచ్‌లో ఎన్టీఆర్ కూడా స్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే. తెలుగు నుంచి ఇద్దరు అగ్ర హీరోలు ఈ యాక్టర్స్ బ్రాంచ్‌లో స్థానం పొందడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

