Ormax Stars India Loves | ‘బాహుబలి’తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas). ఆ తర్వాత వచ్చిన ‘సాహో’, ‘రాధేశ్యామ్’ ‘ఆదిపురుష్’ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్స్గా మిగిలాయి. అయితే ఈ చిత్రాల ఫలితాలు ప్రభాస్ క్రేజ్‌ను ఏమాత్రం తగ్గించలేకపోయాయి. ప్రస్తుతం ఈయన నటించిన ‘సలార్’ (Salaar) చిత్రం డిసెంబర్ 22న విడుదలకు సిద్ధమవుతుంది. కేజీఎఫ్ (KGF) చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వం వహించిన ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ఇక ఇటీవలే విడుదలైన ‘సలార్’ టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక యూట్యూబ్‌లో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన ఇండియన్ టీజర్‌గా నయా రికార్డును క్రియేట్ చేసింది.
ఇదిలా ఉంటే.. ప్రభాస్ తాజాగా మరోసారి ఆర్మాక్స్ (Ormax) లిస్ట్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచాడు.. ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ ప్రతినెల దేశంలోని సెలబ్రిటీల గురించి సర్వే నిర్వహించి.. టాప్ పొజిషన్లో ఉన్న సెలబ్రెటీల జాబితాలను విడుదల చేస్తుంటారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ నెలకు సంబంధించిన మోస్ట్ పాపులర్ మేల్ తెలుగు ఫిలిం స్టార్స్ సర్వే జాబితాను ఆర్మాక్స్ వెల్లడించింది. ఈ లిస్ట్‌లో ప్రభాస్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ప్రభాస్ తర్వాత ఎన్టీఆర్, అల్లుఅర్జున్, మహేష్ బాబు, రామ్‌చరణ్ తరువాతి స్థానాల్లో ఉన్నారు. జూలై, ఆగస్టు నెలల్లో కూడా ప్రభాస్ టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఇక హీరోయిన్లలో సమంత (Samantha) మొదటి స్థానంలో ఉండగా కాజల్ రెండవ స్థానంలో ఉంది. ఇక బాలీవుడ్ హీరోలలో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) టాప్ ప్లేస్‌లో నిలువగా.. హీరోయిన్లలో అలియా భట్ (Alia Bhatt) మొదటి స్థానంలో నిలిచింది.
Ormax Stars India Loves: Most popular male Telugu film stars (Sep 2023) #OrmaxSIL pic.twitter.com/fndfC8WGV1
— Ormax Media (@OrmaxMedia) October 15, 2023
Ormax Stars India Loves: Most popular female Telugu film stars (Sep 2023) #OrmaxSIL pic.twitter.com/RLxUAulfiI
— Ormax Media (@OrmaxMedia) October 15, 2023
Ormax Stars India Loves: Most popular male Hindi film stars (Sep 2023) #OrmaxSIL pic.twitter.com/q8mKMFYVr1
— Ormax Media (@OrmaxMedia) October 12, 2023
Ormax Stars India Loves: Most popular female Hindi film stars (Sep 2023) #OrmaxSIL pic.twitter.com/1sTPXj0cJs
— Ormax Media (@OrmaxMedia) October 12, 2023