‘మనందరికి కుటుంబాలు ఉంటాయి. అయితే దేశాన్ని కాపాడే సైనికుడు మాత్రం 130కోట్ల మంది ప్రజలను తన కుటుంబ సభ్యులుగా భావించి కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు. అలాంటి సైనికులు, వారి త్యాగాల కథే ‘ఆపరేషన్ వాలెంటైన్’ అన్నారు వరుణ్‌తేజ్. ఆయన కథానాయకుడిగా తెలుగు, హిందీ భాషల్లో రూపొందించిన చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రం మార్చి 1న విడుదలకానుంది.
ఈ సినిమాలోని ‘గగనాల’ అనే రెండో గీతాన్ని మంగళవారం విడుదల చేశారు. రామజోగయ్యశాస్త్రి రచించిన ఈ గీతానికి మిక్కీ జే మేయర్ స్వరాలను అందించారు. రొమాంటిక్ మెలోడీగా ఈ పాటను తెరకెక్కించారు. ఈ సినిమాలో వరుణ్‌తేజ్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. దేశ రక్షణలో అలుపెరుగని పోరాటం చేస్తున్న రియల్ సూపర్‌హీరోస్ కథ ఇదని, దేశభక్తి భావాలను పెంపొందిస్తుందని చిత్ర బృందం పేర్కొంది. శక్తిప్రతాప్ సింగ్ హడా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.