Operation Valentine | టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) నటిస్తున్న తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తిప్రతాప్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ (Manushi Chhillar) కథనాయికగా నటిస్తుంది. ఈ మూవీని మార్చి 1న విడుదల చేయనున్నారు. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో వరుస ప్రమోషన్స్ చేస్తుంది చిత్రబృందం. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌తో పాటు ట్రైలర్లు విడుదల చేయగా ప్రేక్షకుల వద్ద నుంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది.
ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇక వార్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా వస్తుండగా.. పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్‌లను అంతమొందించడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసే మిషనే ఆపరేషన్ వాలెంటైన్ అని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో మిర్ సర్వార్, నవదీప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.
It’s U/A for #OperationValentine 🇮🇳
Get ready to experience the soaring spirit of our Brave hearts on the big screens 💥
In cinemas from MARCH 1st ❤️🔥
– https://t.co/YmppZdKgjQ#OPVonMarch1st@IAmVarunTej @ManushiChhillar @ShaktipsHada89 @MickeyJMeyer @iRuhaniSharma… pic.twitter.com/iOzGHyIIjl
— BA Raju’s Team (@baraju_SuperHit) February 28, 2024