Rangabali | ఓపెన్ హార్ట్ విత్ సత్య.. నాగశౌర్య టీం రంగబలి ప్రమోషనల్ వీడియో వైరల్
Rangabali | నాగశౌర్య (Naga Shaurya) నటిస్తోన్న తాజా చిత్రం రంగబలి (Rangabali). జులై 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రంగబలిలో వన్ ఆఫ్ ది కీ రోల్ చేస్తున్న సత్య ప్రమోషన్స్ లో భాగంగా టాలీవుడ్ ఇంటర్వ్యూస్ స్పూప్ వీడియోలు చేశాడని తెలిసిందే. దీనికి సంబంధించిన చిన్న వీడియో ఇప్పటికే నెట్టింట హల్చల్ చేస్తోంది.
Rangabali | టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య (Naga Shaurya) నటిస్తోన్న తాజా చిత్రం రంగబలి (Rangabali). ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ పవన్ బసంశెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. రంగబలి జులై 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నాగశౌర్య టీం ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది. రంగబలిలో వన్ ఆఫ్ ది కీ రోల్ చేస్తున్న సత్య ప్రమోషన్స్ లో భాగంగా టాలీవుడ్ ఇంటర్వ్యూస్ స్పూప్ వీడియోలు చేశాడని తెలిసిందే. దీనికి సంబంధించిన చిన్న వీడియో ఇప్పటికే నెట్టింట హల్చల్ చేస్తోంది.
తాజాగా ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో పార్ట్-1ను లాంఛ్ చేశారు మేకర్స్. ఓపెన్ హర్ట్ విత్ సత్య (Satya), ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ దేవి ప్రియ అంటూ సత్య రెండు గెటప్స్‌లో తనదైన కామిక్ టచ్‌తో చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. స్పూప్ ఇంటర్వ్యూ పార్ట్-2 కూడా ఉండబోతుందని తాజా వీడియోతో హింట్ ఇచ్చేసింది నాగశౌర్య టీం. మరి పార్ట్ 2లో సత్య ఎవరిని ఇమిటేట్ చేయబోతున్నాడో చూడాలి.
పార్ట్-1 వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి..
ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన రంగబలి టీజర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది. రీసెంట్గా విడుదల చేసిన రంగబలి ట్రైలర్ (Rangabali trailer) సినిమా ఫన్ ఎంటర్టైనర్గా సాగనున్నట్టు క్లారిటీ ఇచ్చేసింది. ట్రైలర్ లో ప్రతీ మనిషి పేరు మీద సొంతిల్లుండకపోవచ్చు. సొంత పొలం ఉండకపోవచ్చు.. కానీ సొంతూరు మాత్రం ఉంటది.. అంటూ నాగశౌర్య ఊరు ప్రాముఖ్యత గురించి చెబుతున్న డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి లాంఛ్ చేసిన మన ఊరిలో ఎవడ్రా ఆపేది, కల కంటూ ఉంటే పాటలకు మంచి స్పందన వస్తోంది.
ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి రంగబలి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు షైన్ టామ్ చాకో విలన్‌గా నటిస్తుండగా.. ఆర్ శరత్‌కుమార్, సప్తగిరి, గోపరాజు రమణ, కల్యాణి నటరాజన్, శుభలేఖ సుధాకర్, మురళీ శర్మ, సప్తిగిరి, రాజ్ కుమార్ కసిరెడ్డి, భద్రం, శివనారాయణ, పీకే, పవన్, నోయెల్, రమేశ్ రెడ్డి, హరీష్ చంద్ర, బ్రహ్మాస్త్రి, ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాగశౌర్య దీంతోపాటు నారి నారి నడుమ మురారి, పోలీస్ వారి హెచ్చరిక సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.
రంగబలి టీజర్..
రంగబలి ట్రైలర్..
కల కంటు ఉంటే ఫుల్ లిరికల్ వీడియో సాంగ్..
కల కంటు ఉంటే సాంగ్ ప్రోమో..
మన ఊరిలో లిరికల్ వీడియో సాంగ్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

