Oparation Valentine Movie | వరుణ్ తేజ్ కొత్త సినిమాకు కోట్ల రూపాయల డీల్..!
Oparation Valentine Movie | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎప్పటికప్పుడు తన కథల ఎంపికతో అందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు. ఒకే జానర్‌కు కట్టుబడి ఉండకుండా.. డిఫరెంట్ జానర్లలో సినిమాలు చేస్తూ జనాల్లో తిరుగులేని పాపులారిటీ తెచ్చుకున్నాడు.
Oparation Valentine Movie | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎప్పటికప్పుడు తన కథల ఎంపికతో అందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు. ఒకే జానర్‌కు కట్టుబడి ఉండకుండా.. డిఫరెంట్ జానర్లలో సినిమాలు చేస్తూ జనాల్లో తిరుగులేని పాపులారిటీ తెచ్చుకున్నాడు. రిజల్ట్ గురించి పట్టించుకోకుండా ప్రేక్షకులకు సరికొత్త థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే విధంగా సినిమాలు చేస్తుంటాడు. ఇటీవలే ఆయన నటించిన గాంఢీవధారి అర్జున రిలీజై ఘోర పరాజయం మూటగట్టుకుంది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ఆపరేషన్ వాలైంటైన్ అనే ఏయిర్ ఫోర్స్ బ్యాక్‌డ్రాప్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై వీర లెవల్లో అంచనాలు క్రియేట్ చేశాయి.
శక్తి ప్రతాప్ సింగ్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా శరవేగంగా జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ మేజర్ లీక్ నెట్టింట సంచలనం రేపుతుంది. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని భాషలకు కలుపుకుని రూ.50 కోట్ల రేంజ్లో డీల్ కుదరిందట. ఇందులో నిజం ఎంతుందో తెలియదు కానీ.. ఓ మీడియం రేంజ్ టాలీవుడ్ హీరోకు కేవలం థియేట్రికల్ రైట్స్ ఈ రేంజ్లో రేటు పలికాయంటే మాములు విషయం కాదు. పైగా వరుణ్‌తేజ్ చివరి మూడు సినిమాలు అల్ట్రా డిజాస్టర్లు.
మాజీ మిస్ యూనివర్స్ మానూషీ చిల్లర్ హీరోయిన్గా చేస్తున్న ఈ సినిమాలో వరుణ్ ఏయిర్ ఫోర్స్ అధికారిగా కనిపించనున్నాడు. భారత వాయుసేన సాహసాల నేపథ్యంతో ఈ సినిమాను దర్శకుడు శక్తి ప్రతాప్‌సింగ్ తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్నాడు. ఇక ఈ సినిమాను డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రయూనిట్ ఇటీవలే వెల్లడించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

