Prashanth Neel | సలార్‌లో కేజీఎఫ్ ఛాయలు.. ఈసారి ఆ తప్పు జరగదు: దర్శకుడు ప్రశాంత్‌నీల్
ప్రభాస్ ‘సలార్' సినిమా విడుదలై ఏడాది పూర్తయింది. ప్రశాంత్‌నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 700కోట్ల వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా చివర్లో దర్శకుడు ప్రశాంత్‌నీల్ ‘సలార్ 2 - శౌర్యాంగపర్వం’ను కూడా ప్రకటించేశాడు. దాంతో అభిమానులు సెకండ్ పార్ట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
Prashanth Neel | ప్రభాస్ ‘సలార్’ సినిమా విడుదలై ఏడాది పూర్తయింది. ప్రశాంత్‌నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 700కోట్ల వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా చివర్లో దర్శకుడు ప్రశాంత్‌నీల్ ‘సలార్ 2 – శౌర్యాంగపర్వం’ను కూడా ప్రకటించేశాడు. దాంతో అభిమానులు సెకండ్ పార్ట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో వారందరికోసం ‘సలార్ 2’ అప్డేట్ని ఇచ్చేశారు ప్రశాంత్‌నీల్. ఆయన మాట్లాడుతూ ‘ ‘సలార్’ భారీ విజయాన్ని సాధించినా.. ఒక దర్శకుడిగా ఆ సినిమా విషయంలో పూర్తి సంతృప్తిగా లేను. ఎక్కడో ‘కేజీఎఫ్’ ఛాయలు ఆ సినిమాలో కనిపిస్తుంటాయి. ‘సలార్ 2 – శౌర్యాంగపర్వం’లో మాత్రం ఆ తప్పు జరగదు. ఓ కొత్త సినిమాను ప్రేక్షకులు చూస్తారు.’ అని చెప్పుకొచ్చారు.
ఇంకా మాట్లాడుతూ ‘ఈ కథ రాసుకున్నప్పుడే రెండు భాగాలుగా తీయాలని నిర్ణయించుకున్నా. ఎందుకంటే ఇది దేవా- వరదా అనే ఇద్దరు స్నేహితుల కథ. మలుపులు, కుదుపులు లేకపోతే కథ రక్తికట్టదు. స్నేహం సాఫీగా సాగితే కిక్కుండదు. అందుకే.. కష్టమైనా సరే.. వారిద్దర్నీ విడగొట్టాలి. వారి మధ్య ఓ పెద్ద అపార్థం సృష్టించాలి. ఒకరినొకరు అపార్థం చేసుకోవాలి. శత్రువులుగా మారాలి. ఈ తర్వాత ఏమైంది? అనేది తెరపైనే చూడాలి. దాన్ని ఇప్పుడే రివీల్ చేయలేను.’ అంటూ నవ్వేశారు ప్రశాంత్‌నీల్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

