చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించి..ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది లీడింగ్ యాక్టర్‌గా నిలిచాడు బాలీవుడ్ నటుడు సోనూసూద్ (Sonu Sood). తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, ఉర్దూ సినిమాల్లో నటించి కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. రీసెంట్గా వచ్చిన సామ్రాట్ పృథ్విరాజ్ (Samrat Prithviraj) చిత్రంలో చాంద్బర్దాయ్ పాత్ర (Chand Bardai)లో నటించాడు సోనూసూద్. ఈ సినిమా బాక్సాపీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.
ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. చాలా కష్టపడి సినిమా తీయడం వల్ల మూవీని ఇంకా బాగా తీయగలిగామని అన్నాడు. ఫలితంతో సంబంధం లేకుండా తన పాత్రకు ఉత్తమ ప్రతిభ కనబరచడం ఓ నటుడికి చాలా ముఖ్యమైనదని అభిప్రాయపడ్డాడు. పరాజయాలను స్వచ్చందంగా అంగీకరించాల్సిన అవసరముందని, చేసిన తప్పులు పాఠాలు నేర్చుకొని మెరుగైన ప్రతిభ చూపించేందుకు నటుడికి చాలా ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చాడు సోనూసూద్.
సామ్రాట్ పృథ్విరాజ్ ఫలితాన్ని పక్కనపెడితే ఈ సినిమా తనకు చాలా ప్రత్యేకమైందని అన్నాడు. ప్రస్తుతం విజయ్ ఆంటోనీ నటిస్తోన్న తమిళరసన్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు సోనూసూద్. మరో హిందీ సినిమా కూడా డిస్కషన్స్ లో ఉండగా..త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.