తెలుగందం సందడిగా..
‘పెళ్లిసందడి’ చిత్రంతో టాలీవుడ్లోకి అరంగేట్రం చేసింది అచ్చ తెలుగందం శ్రీలీలా. నాజూకు సొగసులతో అలరారే ఈ భామ తొలి చిత్రంతోనే యువతరంలో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడికి అవకాశాలు వెల్లువెత్తున్నాయి. బుధవారం ఈ భామ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న తాజా సినిమాల తాలూకు పోస్టర్స్‌ను విడుదల చేశారు. రవితేజ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘ధమాకా’. త్రినాథ రావు నక్కిన దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. ఈ సినిమా కొత్త స్టిల్‌లో శ్రీలీల చక్కటి అందంతో ఆకట్టుకుంటున్నది. ఈ సినిమాలో ఆమె ప్రణవి పాత్రలో కనిపించనుంది. ఇక ఈ ఏడాది ఈ వయ్యారి డైరీ ఫుల్ అయిపోయింది. నవీన్ పొలిశెట్టితో ‘అనగనగా ఒక రాజు’, నితిన్-వక్కంతం వంశీ కాంబినేషన్లో శ్రేష్ట్ మూవీస్ రూపొందిస్తున్న చిత్రంతో పాటు వారాహి సంస్థ కన్నడ, తెలుగు భాషల్లో తెరకెక్కిస్తున్న సినిమాలో కూడా ఈ భామే నాయికగా నటిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

