‘కేజీఎఫ్’ రెండు భాగాల చిత్రాలతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు కన్నడ హీరో యష్. ఈ రెండు సినిమాలు ఆయన ఇమేజ్, కెరీర్‌పై చెరగని ప్రభావాన్ని వేశాయి. ఇప్పుడు వాటి నుంచి బయటకు రావడమే యష్‌కు కష్టంగా మారుతున్నది. ‘కేజీఎఫ్’ తర్వాత ఏ తరహా చిత్రం చేయాలి, ఏం చేస్తే తనపై ఉన్న అంచనాలను అందుకోగలను అనేది సందిగ్ధం వీడటం లేదు. అందుకే యష్ తన కొత్త సినిమాను అంత త్వరగా ఎంచుకోవడం లేదు. ప్రస్తుతం ఆయన కుటుంబంతో కలిసి లండన్‌లో విహారానికి వెళ్లారు. తిరిగి వచ్చాక కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేస్తారని సమాచారం.
యష్ టీమ్ మెంబర్ ఒకరు స్పందిస్తూ…‘ ఈసారి తను చేయబోయే సినిమా ‘కేజీఎఫ్’లా ఉండదు. పూర్తిగా మరో వైవిధ్యమైన నేపథ్యం, మూడ్‌లో ఆ సినిమా ఉంటుంది. యాక్షన్ ఉన్నా కానీ అదే ప్రధానంగా ఉండబోదు. కొంతైనా యాక్షన్ లేకుంటే అభిమానులు ఊరుకోరు. ఏప్రిల్‌లో కొత్త సినిమా ప్రకటన ఉంటుంది’ అని చెప్పారు. గతేడాది ఏప్రిల్ 14న ‘కేజీఎఫ్ 2’ విడుదలైంది.