‘కల్కి’ సినిమాలో బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్ ఫస్ట్‌లుక్ ఇది. చూస్తుంటేనే రోమాంచితంగా అనిపిస్తున్న ఈ లుక్ వెనుక కథేంటి? అనేది ఎంతో ఆసక్తిని కూడుకున్న విషయం. అసలు ఆ వ్యక్తి ఎవరు? ఆ రూపం ఏంటి? ఈ కథకీ ఆ వ్యక్తీ సంబంధం ఏంటి? అనేది ప్రేక్షకుల ఊహలకు అందని రీతిలో ఉంటుంది. ఓ యోగిలా, వేల సంవత్సరాల నుంచీ సజీవంగా ఉన్న దివ్యమూర్తిలా కనిపిస్తున్న అమితాబ్ ఫస్ట్‌లుక్ నిజంగా వండర్ అని చెప్పక తప్పదు.
ఎన్నో అద్భుతాల సమాహారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రభాస్ కెరీర్లోనే ఓ మైలురాయిలా నిలిచిపోనుందని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు. ఇందులో కమల్‌హాసన్ పాత్ర సినిమాకే హైలైట్‌గా నిలువనుందని, తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమాగా దర్శకుడు నాగఅశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. దాదాపు 500కోట్ల భారీ బడ్జెట్‌తో వైజయంతీమూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.