ప్రేమలో మోసపోయిన ఓ యువకుడు తనకు జరిగిన అన్యాయంపై కోర్టును ఆశ్రయించడం అనే వినూత్న కథాంశంతో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఒక కోర్టు కేస్’. సూర్యాన్ష్, తనీషా మిశ్రా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి గణేష్ పూడి దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జూలై 17న ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం ఈ చిత్ర టీజర్‌ను హీరో శ్రీకాంత్ ఆవిష్కరించారు.
ప్రతీ ప్రేమికుడికి ప్రేమకోసం పోరాడే హక్కుందనే క్యాప్షన్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, వినోదం..భావోద్వేగాలు కలబోసిన కోర్ట్‌రూమ్ డ్రామాగా ఆకట్టుకుంటుందని దర్శకనిర్మాత గణేష్ పూడి తెలిపారు. వినూత్న కథాంశమిదని, టీజర్‌కు మంచి స్పందన లభిస్తున్నదని హీరో సూర్షాన్ష్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: హర్ష ప్రవీణ్, నిర్మాణ సంస్థ: ఓపెన్ఐస్ ఎంటర్టైన్మెంట్, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాణం, దర్శకత్వం: గణేష్ పూడి.