Meter | కిరణ్ అబ్బవరం మీటర్ నుంచి ఓ బేబి లిరికల్ వీడియో సాంగ్
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తోన్న కమర్షియల్ ఎంటర్టైనర్ మీటర్ (Meter). ఈ మూవీ నుంచి తాజాగా మేకర్స్ ఓ బేబీ జారిపోమాకే లిరికల్ సాంగ్‌ను లాంఛ్ చేశారు.
Meter | బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే.. అదే స్పీడులో అప్డేట్స్ ఇస్తూ మూవీ లవర్స్‌లో జోష్ నింపుతున్నాడు టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఈ టాలెంటెడ్ యాక్టర్ నటిస్తోన్న తాజా చిత్రం మీటర్ (Meter). కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి తాజాగా మేకర్స్ ఓ బేబీ జారిపోమాకే లిరికల్ సాంగ్‌ను లాంఛ్ చేశారు. హీరోయిన్ అతుల్య రవిని ఫాలో అవుతూ కిరణ్ అబ్బవరం పాడుకుంటున్న ఈ పాట స్టైలిష్‌గా యూత్‌ను ఆకట్టుకునేలా సాగుతుంది. బాలాజీ రాసిన ఈ పాటను ధనుంజయ్ పాడాడు.
ఈ సినిమాతో రమేశ్ కడూరి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కోలీవుడ్ భామ అతుల్య రవి (Athulyaa Ravi) హీరోయిన్గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. మీటర్ ఏప్రిల్ 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇటీవలే విడుదల చేసిన ఛమ్మక్ఛమ్మక్ పోరి సాంగ్‌తోపాటు మీటర్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది.
మీటర్ విడుదల కాకముందే కిరణ్ అబ్బవరం ఇటీవలే కొత్త ప్రాజెక్ట్ KA9ను కూడా లాంఛ్ చేశాడు. విశ్వకరుణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. కిరణ్ అబ్బవరం మరోవైపు రూల్స్ రంజన్ లో కూడా నటిస్తున్నాడు.
ఓ బేబి లిరికల్ వీడియో సాంగ్..
High on energy, high on mass 💥💥
Start dancing to the #Meter second single #OhBabyJaaripomake 🔥
Lyrical video out now 🔥
– https://t.co/fwuk1ThnkC#MeterOnApril7th @Kiran_Abbavaram @AthulyaOfficial #RameshKaduri #SaiKartheek @ClapEntrtmnt @SonyMusicSouth pic.twitter.com/htVRmgih8B— Mythri Movie Makers (@MythriOfficial) March 21, 2023
ఛమ్మక్ ఛమ్మక్ పోరి సాంగ్
మీటర్ టీజర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

