అక్షిత్ శశికుమార్, కీర్తి కల్కరే జంటగా రూపొందుతున్న చిత్రం ‘ఓ మై లవ్’. స్మైల్ శ్రీను దర్శకుడు. జి.రామంజిని ఈ చిత్రాన్ని కన్నడ, తెలుగు భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను ఇటీవల ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘యూత్‌ఫుల్ కథతో నేటి తరం ప్రేక్షకులకు నచ్చే అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. అందరికి మా సినిమా నచ్చుతుందనే నమ్మకం వుంది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: చరణ్ అర్జున్.