Telugu Movie Re Release | ఏప్రిల్ 24న మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ఓ అందాల రాక్షసి’
SherajMehdi | మల్టీ టాలెంటెడ్ నటుడు మరియు దర్శకుడు షెరాజ్ మెహదీ రూపొందించిన విభిన్నమైన చిత్రం ‘ఓ అందాల రాక్షసి’. గతంలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అలరించి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
Oh Andala Rakshasi | మల్టీ టాలెంటెడ్ నటుడు మరియు దర్శకుడు షెరాజ్ మెహదీ రూపొందించిన విభిన్నమైన చిత్రం ‘ఓ అందాల రాక్షసి’. గతంలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అలరించి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ప్రేక్షకుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న చిత్ర బృందం, ఈ చిత్రాన్ని ఏప్రిల్ 24న భారీ స్థాయిలో రీ-రిలీజ్ చేయాలని నిర్ణయించింది. ఈ రీ-రిలీజ్ వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేయగా, అనంతరం చిత్ర యూనిట్ మీడియా సమావేశాన్ని నిర్వహించి సినిమా విశేషాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు షెరాజ్ మెహదీ మాట్లాడుతూ, సమాజంలో నేటి కాలంలో అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలను మరియు వారికి జరుగుతున్న అన్యాయాలను దృష్టిలో ఉంచుకుని ఈ కథను సిద్ధం చేసినట్లు తెలిపారు. గ్లామర్ హంగుల కంటే కూడా బలమైన కథాంశానికి ప్రాధాన్యతనిస్తూ రూపొందించిన ఈ సినిమా, పూర్తిగా మహిళా సాధికారత నేపథ్యంలో సాగే ఉమెన్ ఓరియెంటెడ్ చిత్రమని ఆయన పేర్కొన్నారు. అమాయక మహిళలు సమాజంలో ఎలా మోసపోతున్నారో, ఆ మోసాల వెనుక ఉన్న వాస్తవ పరిస్థితులను ఈ చిత్రం కళ్ళకు కట్టినట్లు చూపిస్తుందని, అలాగే ఇటువంటి నేరాలకు పాల్పడే వ్యక్తులకు తగిన శిక్ష పడాల్సిందేననే బలమైన సామాజిక సందేశాన్ని ఈ చిత్రం అందిస్తుందని ఆయన వివరించారు. సినిమాను గతంలో మిస్ అయిన వారు లేదా మళ్ళీ చూడాలనుకునే వారు థియేటర్లకు వచ్చి ఈ ప్రయత్నాన్ని ఆదరించాలని కోరారు.
మహిళలపై జరుగుతున్న వేధింపులు, అత్యాచారాల వంటి దురాగతాలను ఎండగడుతూ, ఇటువంటి నేరాలకు పాల్పడే వారికి చట్టం ద్వారా లేదా ఇతరత్రా ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఈ చిత్రంలో చాలా ప్రభావవంతంగా చూపించారు. కేవలం తెలుగులోనే కాకుండా కన్నడలో ‘ఓ సుందర రాక్షసి’ పేరుతో విడుదలైన ఈ చిత్రం అక్కడ కూడా విశేషమైన ఆదరణ పొందింది. ఈ చిత్రానికి షెరాజ్ మెహదీ దర్శకత్వం వహించడమే కాకుండా, స్వయంగా సంగీతాన్ని కూడా అందించడం విశేషం. స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్‌పై సురీందర్ కౌర్ నిర్మాతగా, తేజిందర్ కౌర్ సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రాన్ని షేర్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో షెరాజ్ మెహదీ హీరోగా నటించగా, విహాన్షి హెగాడే, కృతి వర్మలు హీరోయిన్లుగా కనిపించనున్నారు. వీరితో పాటు నేహా దేశపాండే, ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్, సుమన్ తల్వార్, అనంత్ బాబు, ప్రియా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను అశోక్ దయ్యాల పర్యవేక్షిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anna Konidala | పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. ఇన్స్టాగ్రామ్ ఖాతాను డియాక్టివేట్ చేసిన అన్నా
Shaji Kumar | మలయాళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షాజీ కుమార్ కన్నుమూత!
Vijay Sethupathi | వరుస సినిమాలతో విజయ్ సేతుపతి బాక్సాఫీస్ దండయాత్ర.. రెండు నెలల్లో రెండు చిత్రాలు..!
Scene Movie | సీన్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. రూ. 150 కోట్లు దాటిన సూర్య సినిమా!
Ramayana | 5 రోజుల్లో రూ. 663 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ‘రామాయణం’!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

