NTR30 Movie Latest Update | నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ ‘ఎన్టీఆర్30’. ‘ఆర్ఆర్ఆర్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత తారక్ చేస్తున్న సినిమా కావడంతో ప్రతీ ఒక్కరిలోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. పైగా ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్‌బస్టర్ కాంబో రిపీటవడంతో ప్రతీ ఒక్కరిలోనూ ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. ఆచార్యతో కోలుకోలేని దెబ్బతిన్న కొరటాల శివ ఈ సినిమాతో ఎలాగైనా గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వాలని కసితో ఉన్నాడు. ఇక ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ఘనంగా ప్రారంభమైంది. అంతేకాకుండా మొదటి షెడ్యూల్ కూడా పూర్తయినట్లు సమాచారం. ఈ షెడ్యూల్లో తారక్‌పై కీలక సన్నివేశాలు తెరకెక్కించినట్లు తెలుస్తుంది.
కాగా ఆ షెడ్యూల్లో ఓ భారీ ఫైట్ సీన్ కూడా పూర్తి చేసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఆ ఫైట్ సీన్ కుస్తీ పోటీ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తుంది. ఈ ఫైట్ సీన్ కోసం తారక్ కూడా తన దేహానికి పని చెప్పినట్లు సమాచారం. ఎన్టీఆర్ కుస్తీ యోధుడిగా కనిపిస్తున్నాడంటేనే ప్రతీ ఒక్కరిలో ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. సినిమాలో ఈ ఫైట్ ఎపిసోడ్ మేజర్ రోల్ పోషిస్తుందని అంటున్నారు.
సముద్రం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ స్వరాలు సమకూర్చుతున్నాడు. ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీకపూర్ నటిస్తుంది. తెలుగులో జాన్వీకి ఇదే తొలి సినిమా కావడం విశేషం. యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ సినిమాకు దేవర అనే టైటిల్‌ను పరిశీలనలో ఉంచినట్లు టాక్. ఈ సినిమా కోసం కొరటాల హాలీవుడ్ టెక్నీషియన్లను రంగంలోకి దింపాడు. వచ్చే ఏడాది మే 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.