NTR30 | భారీ ఫైట్ సీన్‌తో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి.. తారక్ మంచి స్పీడ్ మీదున్నాడుగా..!
‘ఆర్ఆర్ఆర్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత తారక్ చేస్తున్న సినిమా కావడంతో NTR30 సినిమాపై అందరిలోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. పైగా జనతా గ్యారేజ్ వంటి బ్లాక్‌బస్టర్ కాంబో రిపీటవడంతో ప్రతీ ఒక్కరిలోనూ ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి.
NTR30 Movie | నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ ‘ఎన్టీఆర్30’. ‘ఆర్ఆర్ఆర్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత తారక్ చేస్తున్న సినిమా కావడంతో అందరిలోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. పైగా ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్‌బస్టర్ కాంబో రిపీటవడంతో ప్రతీ ఒక్కరిలోనూ ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. ‘ఆచార్య’తో కోలుకోలేని దెబ్బతిన్న కొరటాల శివ ఈ సినిమాతో ఎలాగైనా గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వాలని కసితో ఉన్నాడు. ఇటీవలే షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమా తాజాగా మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది.
తొలి షెడ్యూల్లో ఓ భారీ ఫైట్ సీన్ తెరకెక్కించినట్లు తెలుస్తుంది. మొత్తం ఈ షెడ్యూల్ తొమ్మిది రోజుల పాటు జరిగిందట. ఇక ఏప్రిల్ చివరి వారంలో రెండో షెడ్యూల్‌ను ప్రారంభించనున్నట్లు సమాచారం. సముద్రం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ స్వరాలు సమకూర్చుతున్నాడు. ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీకపూర్ నటిస్తుంది. తెలుగులో జాన్వీకి ఇదే తొలి సినిమా కావడం విశేషం. యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ సినిమాకు దేవర అనే టైటిల్‌ను పరిశీలనలో ఉంచినట్లు టాక్. ఈ సినిమా కోసం కొరటాల హాలీవుడ్ టెక్నీషియన్లను రంగంలోకి దింపాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

