Tiger 3 Movie | సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’లో యంగ్ టైగర్.?
Tiger 3 | టైగర్ ప్రాంఛైజీలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ సెట్ చేశాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఇదే జోనర్లో టైగర్ 3 (Tiger 3) రాబోతుంది. మనీశ్ శర్మ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.
Tiger 3 | టైగర్ ప్రాంఛైజీలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ సెట్ చేశాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఇదే జోనర్లో టైగర్ 3 (Tiger 3) రాబోతుంది. మనీశ్ శర్మ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. దీపావళి కానుకగా ఈ సినిమా నవంబర్ 12 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఈ సినిమా విడుదలకు ఇంకా కొన్ని గంటలే మిగిలివుంది. ఈ నేపథ్యంలో ఒక సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఇప్పటికే ‘టైగర్ 3 సినిమాటిక్ యూనివర్స్‌లో పఠాన్‌గా షారుక్ ఖాన్, మేజర్ కబీర్ ధలీవాల్ పాత్రలో హృతిక్‌రోషన్ గెస్ట్ రోల్స్‌లో రానున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ స్పై యూనివర్స్‌లోకి తాజాగా మరో స్టార్ హీరో ఎంటర్ అయ్యాడు. ఇంతకీ అతను ఎవరో కాదు. టాలీవుడ్ స్టార్ హీరో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ (NTR). అవును.. ‘టైగర్ 3’లో తారక్ స్పెషల్ కామియో ఉన్నట్లు తెలుస్తుంది.
యష్ రాజ్ ఫిలిమ్స్ (Yash Raj Films) యూనివర్స్‌లో భాగంగా వస్తున్న ‘వార్ 2’(War 2)లో హృతిక్‌రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ విలన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. అయితే తాజాగా ఈ రోల్‌కి సంబంధించి ‘టైగర్ 3’ లో ఇంట్రో ఉండనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇది నిజమో కాదో అన్నది తెలియాలంటే రేపు విడుదలవుతున్న టైగర్ 3 చూస్తేనే తెలుస్తుంది.
యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ సినిమా ఏకకాలంలో రిలీజ్ కాబోతుంది. యష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సల్మాన్‌కు జోడీగా బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ హీరోయిన్గా నటిస్తుండగా.. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక గతంలో ఈ సిరీస్‌లో తెరకెక్కిన ఏకా థా టైగర్, టైగర్ జిందా హే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళను సాధించాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

