దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సక్సెస్ తర్వాత మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా కూడా తప్పకుండా తెలుగు సినిమా ఖ్యాతిని మరో లెవెల్ తీసుకు వెళుతుందని చెప్పవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో నటించగా అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనిపించబోతున్నాడు. ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్కు రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉంటుందో తెలిసిన సంగతే.
జనవరి 7న చిత్రం విడుదల కానుండగా, ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చాయి. నాటు నాటు వీర నాటు పాట కొద్ది గంటల్లోనే యూట్యూబ్‌లో రికార్డ్స్ సృష్టించింది. ఇక మరోసారి కిరవాణి తన మ్యూజిక్‌తో సత్తా చాటాడు. ఇందులో చరణ్, ఎన్టీఆర్ స్టెప్పులకు తెగ ఫిదా అయ్యారు అభిమానులు. పాటలో కాళ్లను ఎడమవైపు, కుడివైపుతోపాటు ముందుకు, వెనక్కు కదులుతూ ఉండాలి. ఈ స్టెప్స్ పర్ఫెక్ట్ గా రావడానికి చరణ్, తారక్ 15-18 టేక్స్ తీసుకున్నామని ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
స్టెప్స్ సరిగ్గా రావడం కోసం రాజమౌళి నరకం చూపించాడని.. తమ స్టెప్పులు కరెక్ట్ గా వస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి మధ్య మధ్యలో డాన్స్ ఆపేవాడు. దాదాపు 18 టేక్స్ తీసుకున్న తర్వాత రాజమౌళి ఒకే చెప్పారని.. ఇప్పుడు పాట విడుదలైన తర్వాత అదరు పొగుడుతూ ఉంటే.. రాజమౌళి విజన్ అర్థమైందన్నారు ఎన్టీఆర్. స్టెప్పులు రికార్డ్ అయ్యాక మళ్లీ వెనక్కి వెళ్లి కాళ్ళ మూమెంట్, తర్వాత మా చేతుల మూమెంట్ చూసి ఆ తర్వాత ఇద్దరి స్టెప్పులు సింక్ అయ్యాయా లేదా అని పలు మార్లు పరిశీలించాడని ఎన్టీఆర్ అన్నాడు. ఆడియన్స్ పల్స్ పట్టుకోవడంలో రాజమౌళి దిట్ట అందుకే ఆయన ఈ రోజు టాప్ డైరెక్టర్‌గా ఉన్నారని చెప్పుకొచ్చాడు.