NTR- NEEL | 45 ఏళ్ల తర్వాత తెలుగు సినిమాకి రీఎంట్రీ… యన్టీఆర్–ప్రశాంత్ నీల్ మూవీపై భారీ క్రేజ్
NTR- NEEL | పాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘కేజీఎఫ్’ రెండు భాగాలు జాతీయస్థాయిలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తరువాత ‘సలార్’తో మరోసారి హిట్ కొట్టిన నీల్, ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్‌తో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను రూపొందిస్తున్నారు.
NTR- NEEL | పాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘కేజీఎఫ్’ రెండు భాగాలు జాతీయస్థాయిలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తరువాత ‘సలార్’తో మరోసారి హిట్ కొట్టిన నీల్, ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్‌తో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను రూపొందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, యన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మొదట ‘డ్రాగన్’గా పిలిచినప్పటికీ, అధికారికంగా ఎలాంటి టైటిల్ ప్రకటించకపోవడంతో ‘యన్టీఆర్–నీల్ మూవీ’ గానే పేరు వినిపిస్తోంది. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ నాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.
తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ ఒక కీలక పాత్రలో నటించనున్నారన్న వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దాదాపు 45 ఏళ్ల తర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు ప్రేక్షకులకు అనిల్ కపూర్ కొత్త కాదు. బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ‘వంశవృక్షం’ చిత్రంలో ఆయన తొలిసారి ఫుల్ లెంగ్త్ పాత్ర చేశారు. అనంతరం బాపు రూపొందించిన హిందీ చిత్రాలు ‘హమ్ పాంచ్’, ‘వో సాత్ దిన్’ వంటి సినిమాలతో గుర్తింపు పొందారు. ఇప్పుడు ఇన్నేళ్లకు మళ్లీ తెలుగు సినిమాలో ఆయన నటిస్తుండటం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అనిల్ కపూర్ ఇటీవల రణబీర్ కపూర్‌తో చేసిన ‘యానిమల్’ చిత్రంలో తండ్రి పాత్రలో మెప్పించారు. అదే తరహాలో, ఎన్టీఆర్‌తో ఆయన నటించడం ఇది రెండోసారి.
గతంలో వీరిద్దరు‘వార్ 2’ లో కలిసి నటించారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ఉత్తరాదిలో ఎన్టీఆర్‌కు భారీ క్రేజ్ తీసుకొచ్చింది. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అనిల్ కపూర్ కీలకమైన పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ‘కేజీఎఫ్ 2’లో సంజయ్ దత్‌ను శక్తివంతమైన విలన్‌గా చూపించిన నీల్, ఈ సినిమాలో కూడా అనిల్ కపూర్ కోసం ప్రత్యేకమైన పాత్రను రాసినట్లు సమాచారం. అనిల్ కపూర్ ‘వార్ 2’లో పాజిటివ్ రోల్లో కనిపించారు. అయితే ఈసారి విలక్షణమైన పాత్రలో కనిపించనున్నారని టాక్. ఎన్టీఆర్, నీల్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంలో అనిల్ కపూర్ ఏ తరహా పాత్ర పోషిస్తారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chandrayaan | మందమర్రి టు చందమామ.. నవంబర్ 13న థియేటర్లలోకి ‘చంద్రయాన్’ నవ్వుల రాకెట్!
బడిలో మద్యం సేవిస్తూ పట్టుబడ్డ హెడ్మాస్టర్ : వీడియో
Stock Market | నేడూ కొనసాగిన బుల్ జోష్.. సెన్సెక్స్ వరుసగా రెండోరోజూ 1200 పాయింట్లు జంప్..!
గ్రామాల్లో పారిశుధ్య పనులపై డీపీఓ అనూష ఆకస్మిక తనిఖీలు
అగ్నిప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

