NTR30 | యాక్షన్ షురూ చేసిన తారక్.. ఇక విధ్వంసమే..!
NTR30 Shooting Begins | ఎప్పుడెప్పుడా అని నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్న 'ఎన్టీఆర్30' షూటింగ్ శుక్రవారం ప్రారంభం కానుంది. ఈ మేరకు చిత్రబృందం ఓ పోస్టర్ను విడుదల చేసింది.
NTR30 Shooting Begins | ఎప్పుడెప్పుడా అని నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్న ‘ఎన్టీఆర్30’ షూటింగ్ శుక్రవారం ప్రారంభంఅయింది. ట్రిపుల్ తర్వాత ఏడాదికి తారక్ సెట్స్ మీదకు అడుగుపెట్టాడు. ‘ఆర్ఆర్ఆర్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత తారక్ చేస్తున్న సినిమా కావడంతో నందమూరి ఫ్యాన్సే కాదు సగటు సినీ ప్రేక్షకుడు సైతం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నాడు. పైగా ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్బస్టర్ కాంబో రిపీటవడంతో ప్రతీ ఒక్కరిలో ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. ఆచార్యతో కోలుకోలేని దెబ్బతిన్న కొరటాల శివ ఈ సినిమాతో ఎలాగైనా గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వాలని కసితో ఉన్నాడు.
ఇక ఇప్పటికే ఈ సినిమా కోసం పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లను కొరటాల రంగంలోకి దింపాడు. కాగా తొలిరోజునే యాక్షన్ సీన్స్తో షూటింగ్ మొదలుపెట్టనున్నాడట. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కేన్నీ బేట్స్ సూపర్ విజన్లో ఫైట్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. సముద్రం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ స్వరాలు సమకూర్చుతున్నాడు. ఎన్టీఆర్కు జోడీగా జాన్వీకపూర్ నటిస్తుంది. తెలుగులో జాన్వీకి ఇదే తొలి సినిమా కావడం విశేషం. యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ సినిమాకు దేవర అనే టైటిల్ను పరిశీలనలో ఉంచినట్లు టాక్.
HERO back to movie sets after 582 DAYS….
#NTR30 ACTION BEGINS Today 💥💥💥All the Best Anna…. @tarak9999 ❤#NTRKoratalaSiva2 pic.twitter.com/NeY7cugjSs
— 𝐍𝐓𝐑 𝐓𝐡𝐞 𝐒𝐭𝐚𝐥𝐰𝐚𝐫𝐭 (@NTRTheStalwart) March 31, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

