ఎన్టీఆర్ ప్రస్తుతం తన 30వ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తున్నారు. జాన్వీ కపూర్ నాయికగా నటిస్తున్నది. ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్తో పాటు టైటిల్ను ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి ‘దేవర’ అనే టైటిల్ను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ పేరు సోషల్ మీడియాలోనూ బాగా ప్రచారమవుతున్నది. ఈ టైటిల్ను ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా చిత్రబృందం అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తున్నది.
రెగ్యులర్ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా కోసం ఇప్పటికే భారీ యాక్షన్ సీక్వెన్సులు తెరకెక్కించగా..మరి కొద్ది రోజుల పాటు ఏకబిగిన భారీ ఫైట్ సీన్స్ చేయబోతున్నారట. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ సారథ్యంలో ఈ సీక్వెన్సులు రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది.