KH233 | KH233 షురూ.. వీడియో షేర్ చేసిన కమల్ హాసన్
KH233 | హెచ్ వినోథ్ (H Vinoth) లోకనాయకుడు కమల్ హాసన్ (kamalhaasan)తో సినిమా చేయబోతున్నాడని తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ను వీడియో రూపంలో షేర్ చేశాడు ఉలగనాయగన్. KH233 షురూ అంటూ లాంఛ్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
KH233 | వలిమై, తునివు సినిమాలతో డైరెక్టర్‌గా మంచి బ్రేక్ అందుకున్నాడు తమిళ దర్శకుడు హెచ్ వినోథ్ (H Vinoth). ఈ క్రేజీ డైరెక్టర్ లోకనాయకుడు కమల్ హాసన్ (kamalhaasan)తో సినిమా చేయబోతున్నాడని తెలిసిందే. ఈ చిత్రం కమల్ హాసన్ KH233 ప్రాజెక్ట్‌గా రానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ను వీడియో రూపంలో షేర్ చేశాడు ఉలగనాయగన్. KH233 షురూ అంటూ లాంఛ్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
రైజ్ టు రూల్ ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ చిత్రాన్ని కమల్ హాసన్ సమర్పణలో హోంబ్యానర్ రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్పై కమల్ హాసన్-ఆర్ మహేంద్రన్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. హెచ్ వినోథ్ సామాజిక కథాంశంతో అందరినీ ఆలోచింపజేసేలా సినిమా ఉండనుందని తాజా వీడియోతో అర్థమవుతోంది. ఈ చిత్రంలో పాపులర్ యాక్టర్లు భాగం కాబోతుండగా.. రానున్న రోజుల్లో క్లారిటీ రానుంది.
మీ(కమల్ హాసన్) తో పనిచేసే గొప్ప అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్.. అంటూ సినిమా ప్రకటిస్తున్న సందర్భంగా ట్వీట్ చేశాడు హెచ్ వినోథ్. కమల్ హాసన్ మరోవైపు లెజెండరీ దర్శకుడు మణిరత్నం డైరెక్షన్లో KH234 ప్రాజెక్ట్‌కు కూడా సైన్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో దాదాపు ఫైనల్ అయినట్టు తెలుస్తోండగా.. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
And it begins…#RKFI52 #KH233
#RISEtoRULE #HVinoth #Mahendran @RKFI @turmericmediaTM @magizhmandram pic.twitter.com/7cej87cghE— Kamal Haasan (@ikamalhaasan) July 4, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nikeelu Gunda | సూపర్ ఏఐ అకాడమీ ఫౌండర్ నికీలు గుండాకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
100 Feets Master Plan Road | మేం కష్టపడి కట్టుకున్న స్కూల్ పోతుంది.. 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు రీఅలైన్మెంట్పై బాధిత మహిళ
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

