గ్లామర్ ఇమేజ్ కోరుకోలేదు

గ్లామర్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకోవాలని తానెప్పుడూ కోరుకోలేదని అంటోంది లావణ్య త్రిపాఠి. ఒకే ఒరవడికి పరిమితం కాకుండా విభిన్న పాత్రల్లో నటించాలన్నదే తన అభిమతమని చెబుతోంది. జయాపజయాలకు అతీతంగా తెలుగులో చక్కటి అవకాశాల్ని అందుకుంటూ కెరీర్లో ముందుకు సాగుతోంది లావణ్య త్రిపాఠి. సినిమాల ఎంపికలో తన ప్రాధామ్యాల గురించి లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ ‘గ్లామర్ అనే మాటకు సరైన నిర్వచనాన్ని చెప్పడం కష్టమే. ఈవిషయంలో అందరి అభిప్రాయాలు ఒకేలా ఉండవు. కొన్నిసార్లు సినిమాల్లో పాత్రలకు అనుగుణంగా ఆధునిక వస్త్రధారణలో కనిపించాల్సివస్తుంది. అందాల ప్రదర్శన కోసమే అలాంటి దుస్తులు వేసుకున్నామని అనుకోవడం అపోహ అవుతుంది. ధరించే దుస్తులపై గ్లామర్ ఆధారపడి ఉండదు. నా వరకైతే సంప్రదాయ దుస్తుల్లోనే ఎక్కువఅందంగా కనిపిస్తామని నమ్ముతుంటా. సినిమాల పరంగా గ్లామర్ హీరోయిన్ అనే ఇమేజ్ను నేనెప్పుడూ కోరుకోలేదు. కమర్షియల్ సినిమాలతో పోలిస్తే నటనకు ఆస్కారమున్న వైవిధ్యమైన పాత్రలు చేయడానికే ప్రాధాన్యతనిస్తా. ఎన్ని సినిమాలు చేశామన్నది కాకుండా ఎలాంటి వాటిలో నటించానన్నదే నాకు ముఖ్యం. అంతిమంగా మంచి సినిమా చేశామనే సంతృప్తి ఉండాలి. సినిమాల ఎంపికలో అదే నేను నమ్మే సిద్ధాంతం’ అని చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Husband Hug | భార్యను ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Fine Rice | సన్నధాన్యం తన్నకుపోతున్నరు.. పచ్చి ధాన్యాన్నే కొంటున్న పొరుగు రాష్ర్టాల బ్రోకర్లు
Drugs | పల్లెల్లోకి డ్రగ్స్ మహమ్మారి.. విచ్చలవిడిగా వినియోగిస్తున్న యువత.. ఓ బాలికకు పలుమార్లు మత్తు ఇంజెక్షన్లు ?!
Revanth Reddy | సన్నబియ్యం కిలో రూ.95.. ఎల్ నినో ఎఫెక్ట్‌తోనే ధరలు పెరుగుతున్నాయి: రేవంత్‌రెడ్డి
Krishna Water | ఎవరి బాబు నీళ్లవి?… ఇటు 70 కిలోమీటర్లు ఎందుకు రావు.. అటు 700 కిలోమీటర్లు ఎట్ల పారినయ్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | భార్యను ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

