Kaala Teaser | తమిళంలో పరిచయమై.. ‘మెంటల్ మదిలో’ (Mental Madhilo) అంటూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నది నివేతా పేతురాజ్ (Nivetha pethuraj). తొలి చిత్రంతోనే మంచి మార్కులు కొట్టేసిన ఈ తమిళ కుట్టి ఆ తర్వాత ‘అల వైకుంఠపురంలో’, ‘విరాటపర్వం’ ‘దాస్ కా ధమ్కీ’ సినిమాలతో మెప్పించింది. తాజాగా ఈ భామ ‘కాలా’ (Kaala) అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తుంది. ఈ వెబ్‌సిరీస్‌కు డేవిడ్ (David), సోలో(Solo), వాజిర్ (Wazir) చిత్రాల ఫేమ్ బిజోయ్ నంబియార్ (Bejoy Nambiar) దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా సిరీస్ నుంచి మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు.
టీజర్ గమనిస్తే.. చీకటి ప్రపంచంలో ఉన్న ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ స్టోరీ గురించి చెబుతున్నట్లు సాగింది. ఇక ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ+ హాట్‌స్టార్‌లో సెప్టెంబర్ 15 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ వెబ్సిరిస్ను డిస్నీ+ హాట్‌స్టార్, టీ సిరీస్, భూషన్ కుమార్ ప్రోడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. నివేతా పేతురాజ్, అవినాష్ తివారీ, రోహన్ వినోద్ మెహ్రా, తాహెర్ షబ్బీర్, హితేన్ తేజ్వానీ ప్రధాన పాత్రాలు పోషిస్తున్నారు.
Andhkaar me jo dikhta hai tumko, haan woh rang Kaala hai! Watch #HotstarSpecials #Kaala streaming from 15th September #KaalaOnHotstar#BhushanKumar #KrishanKumar @TSeries @nambiarbejoy #ShivChanana pic.twitter.com/pB1EOAkjC5
— Disney+ Hotstar (@DisneyPlusHS) August 23, 2023