కుమారిగా మారిపోయి..
సినిమాలతో సమానంగా వెబ్‌సిరీస్‌లూ క్రేజ్ సంపాదించుకున్నాయి. అగ్ర నటులు కూడా ఇటువైపు మొగ్గుతున్నారు. ఆ జాబితాలో చేరడమే కాదు, ఓటీటీలో మంచి హిట్‌నూ అందుకున్నది టాలీవుడ్ ముద్దుగుమ్మ.. నిత్యామీనన్. ‘అమెజాన్ ప్రైమ్'లో ఆడుతున్న ‘కుమారి శ్రీమతి’ వెబ్‌సిరీస్‌లో మధ్యతరగతి పల్లెటూరి అమ్మాయి పాత్రలో మెరిసింది ఈ అమ్మడు..
సినిమాలతో సమానంగా వెబ్‌సిరీస్‌లూ క్రేజ్ సంపాదించుకున్నాయి. అగ్ర నటులు కూడా ఇటువైపు మొగ్గుతున్నారు. ఆ జాబితాలో చేరడమే కాదు, ఓటీటీలో మంచి హిట్‌నూ అందుకున్నది టాలీవుడ్ ముద్దుగుమ్మ.. నిత్యామీనన్. ‘అమెజాన్ ప్రైమ్’లో ఆడుతున్న ‘కుమారి శ్రీమతి’ వెబ్‌సిరీస్‌లో మధ్యతరగతి పల్లెటూరి అమ్మాయి పాత్రలో మెరిసింది ఈ అమ్మడు..
అనుకున్నది సాధించి తీరాలనే మొండి పట్టుదల ఉన్న పాత్ర శ్రీమతి. ఆ అమ్మాయి హీరో నాని వీరాభిమాని. వెబ్‌సిరీస్‌లో ఈ పాయింట్ నాకెంతో నచ్చింది. నా తొలి సినిమా ‘అలా మొదలైంది’.. నానీతోనే చేశాను. దీంతో నాని అభిమానిగా నటించడం సరదాగా అనిపించింది.
ఈ మధ్య నేను చేసిన అన్ని పాత్రలూ గ్రామీణ నేపథ్యానికి చెందినవే. గలగలా మాట్లాడే పల్లెటూరి అమ్మాయిగా నటించడం ఇది మూడోసారి. గత ఆగస్టులో వచ్చిన తమిళ సినిమా ‘తిరుచిత్రాంబలం’లో శోభన పాత్ర కూడా ఇలాంటిదే. తర్వాత చేసిన మలయాళ సినిమాలో కూడా ఇలాంటి నేపథ్యమున్న క్యారెక్టరే నాది.
నేను పల్లెటూరి ఆడపిల్ల పాత్రకు అంతగా సరిపోనని నా నమ్మకం. అందుకే వాళ్ల హావభావాలు, మేనరిజం కంటే ముందుగా.. పాత్ర స్వభావం తెలుసుకుని ఆ ప్రకారంగా నటిస్తా. అలా పాత్రకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నా.
ఏ పాత్ర అయినా.. డైరెక్టర్‌తో చర్చించి నేను చేయగలనన్న నమ్మకం వచ్చాకే ఎంచుకుంటాను. కొత్త వెబ్ సిరీస్ విజయం ఉత్సాహాన్నిచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Y.S. Jagan | ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లతో దాడులు.. ఖండించిన వైఎస్ జగన్
Farmers Protest | మోటార్లు తొలగించాలన్న ఆదేశాలకు నిరసనగా రైతుల ఆందోళన
Navaratri Brahmotsavams | మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి
Armoor | ఆర్మూర్ 10వ వార్డులో డ్రైనేజీ అస్తవ్యస్తం.. ఇబ్బంది పడుతున్న జనం
Ranabali Review | ‘రణబాలి’ మూవీ రివ్యూ: విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ పూనకం.!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

