Extra Ordinary Man | ‘ఎక్స్ట్రా – ఆర్డినరీ మ్యాన్’గా నితిన్ రానున్నాడు. శ్రీలీల కథానాయిక. వక్కంతం వంశీ దర్శకుడు. ఎన్.సుధాకర్‌రెడ్డి, నికితారెడ్డి నిర్మాతలు. ప్రస్తుతం శంషాబాద్‌లో వేసిన భారీ సెట్లో మూడొందలమంది ఫారిన్ డాన్సర్లతో జానీ మాస్టర్ నేతృత్వంలో పక్కా మాస్సాంగ్ను శ్రీలీల, నితిన్‌లపై చిత్రీకరిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘ ఇప్పటికే విడుదలైన ‘డేంజర్ పిల్లా..’, ‘బ్రష్ వేస్కో..’ పాటలకు అద్భుతమైన స్పందన వస్తున్నది. ఇటీవల విడుదలైన టీజర్ కూడా అమేజింగ్‌గా ఉందంటున్నారు.
కథ, నితిన్ కేరక్టరైజేషన్ ఈ సినిమాకు ప్రధాన బలాలు. ఈ కథకు జూనియర్ ఆర్టిస్టే హీరో. సినిమాల్లో నటించే జూనియర్ ఆర్టిస్ట్‌గా ఇందులో నితిన్ కనిపిస్తాడు. ప్రస్తుతం చిత్రీకరిస్తున్న పాటతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. డిసెంబర్ 8న సినిమాను విడుదల చేస్తాం’ అని తెలిపారు. డా.రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో సుధేవ్ నాయర్, రావు రమేశ్, రోహిణి ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: హేరిస్ జయరాజ్.