నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్’. వక్కంతం వంశీ దర్శకుడు. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మాతలు. శ్రీలీల కథానాయిక. ఈ చిత్రాన్ని డిసెంబర్ 8న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ‘నితిన్ పాత్ర గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. క్యారెక్టర్ బేస్డ్ మూవీ ఇది. ‘కిక్’ తర్వాత ఆ రేంజ్లో తెరకెక్కిస్తున్నాం.
చక్కటి వినోదంతో పాటు అనూహ్య మలుపులతో ఆకట్టుకుంటుంది. నితిన్ లుక్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. కథాపరంగా ఎన్నో సర్ప్రైజ్లు చూడొచ్చు. హారీస్ జైరాజ్ సంగీతం ప్రధానాకర్షణగా నిలుస్తుంది’ అని చిత్రబృందం పేర్కొంది.