రుక్మిణి దాచిన రహస్యం
కృష్ణ ఓ మధ్యతరగతి యువకుడు. ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంటాడు. కొన్ని నిజాలను బయటపెట్టకుండా ఉంటేనే మంచిదనే అభిప్రాయంతో ఉంటాడు. అలాంటి సమయంలో అతని జీవితంలోకి ఓ అమ్మాయి ప్రవేశిస్తుంది.
కృష్ణ ఓ మధ్యతరగతి యువకుడు. ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంటాడు. కొన్ని నిజాలను బయటపెట్టకుండా ఉంటేనే మంచిదనే అభిప్రాయంతో ఉంటాడు. అలాంటి సమయంలో అతని జీవితంలోకి ఓ అమ్మాయి ప్రవేశిస్తుంది. వారిద్దరి ప్రేమాయణం కొనసాగుతున్న క్రమంలో కృష్ణ ఓ రహస్యాన్ని తెలుసుకుంటాడు. అప్పటి నుంచి పరిస్థితులన్నీ తలకిందులవుతాయి. సమాజం అంగీకరించే, ప్రశ్నించే అంశాల మధ్య ఓ సంఘర్షణ ఏర్పడుతుంది.
ఈ నేపథ్యంలో కృష్ణ ప్రేమ ప్రయాణం ఏ తీరాలకు చేరిందో తెలుసుకోవాలంటే ‘అలియాస్ రుక్మిణి’ చూడాల్సిందే అంటున్నారు మేకర్స్. నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకుడు. నాని సమర్పణలో ఆయన సోదరి దీప్తి గంటా నిర్మిస్తున్నారు. ఇంకా ఓ షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉందని, త్వరలో తొలిపాటను విడుదల చేస్తామని నిర్మాత దీప్తి గంటా తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్, రచన-దర్శకత్వం: మురళీకాంత్ దేవసోత్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

