Nithiin32 | స్మగ్లర్‌గా నితిన్.. వక్కంతం వంశీ భారీగానే ప్లాన్ చేస్తున్నట్టున్నాడుగా..!
యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. 'భీష్మ' వంటి భారీ విజయం తర్వాత బ్యాక్ టు బ్యాక్ మూడు ఫ్లాపులు రావడంతో నితిన్ తీవ్రంగా నిరాశపడ్డాడు. ఇటీవలే నితిన్ తన రూటు మార్చి 'మాచర్ల నియోజకవర్గం'తో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
Nithiin32 Movie | యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ‘భీష్మ’ వంటి భారీ విజయం తర్వాత బ్యాక్ టు బ్యాక్ మూడు ఫ్లాపులు రావడంతో నితిన్ తీవ్రంగా నిరాశపడ్డాడు. ఇటీవలే నితిన్ తన రూటు మార్చి ‘మాచర్ల నియోజకవర్గం’తో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఆయన ఆశలన్ని వక్కంతం వంశీ సినిమాపైనే ఉన్నాయి. ‘నా పేరు సూర్య’ వంటి డిజాస్టర్ ఇచ్చిన.. వక్కంతం వంశీపై నితిన్ పూర్తి నమ్మకంతో ఉన్నట్లు సమాచారం. కథ బలంగా ఉందని, ఖచ్చితంగా సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందని చిత్రబృందం ధీమాగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మారేడుమిల్లి అడవుల్లో జరుగుతుంది. ఇటీవలే లీక్ అయిన నితిన్ రగ్గుడ్ లుక్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచింది. కాగా ఈ సినిమాలో నితిన్ స్మగ్లర్‌గా కనిపించనున్నాడట. అంతేకాకుండా లారీ డ్రైవర్‌గా కూడా పనిచేస్తాడట. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. నితిన్‌కు జోడీగా పెళ్ళిసందD బ్యూటీ శ్రీలీల నటిస్తుంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలోపు షూటింగ్ పూర్తి చేసి.. సమ్మర్‌కు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది. హరీస్ జయరాజ్ బాణీలు సమకూర్చుతున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

