Tammudu Movie | టాలీవుడ్ హీరో నితిన్(Nithiin) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా అభిమానులతో పాటు సినీ ప్రముఖులు నితిన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే నితిన్ బర్త్ డే సందర్భంగా తాను నటిస్తున్న కొత్త ప్రాజెక్ట్ నుంచి టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా తమ్ముడు (Thammudu) అనే టైటిల్‌తో వస్తుండగా.. ఈ చిత్రానికి ‘వకీల్ సాబ్’ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ లోగో విడుదలైంది. ఇక ఈ పోస్టర్లో నితిన్ మాస్ లుక్‌లో అదరగొడుతున్నాడు.
ఇక ఈ పోస్టర్ గమనిస్తే.. నితిన్ బస్‌పై కూర్చొని సుబ్రమణ్య స్వామి ఆయుధం పట్టుకుని కనిపిస్తున్నాడు. ఇక నితిన్ గత చిత్రాలకు భిన్నంగా.. చాలా క్రియేటివ్‌గా ఇ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కాంతార, విరూపాక్ష చిత్రాల సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తుండగా.. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నాడు.
Happy birthday Tammudu ❤️@actor_nithiin 🎂🎈💐
Wishing you a huge Blockbuster year starting with #Tammudu pic.twitter.com/rg00OuEHza— KONA VENKAT (@konavenkat99) March 30, 2024