Macherla Niyojakavargam | నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ ట్రైలర్ లాంచ్ ప్రోమో..!
Macherla Niyojakavargam Trailer Launch | హిట్లు ఫ్లాప్‌లతో సంబంధంలేకుండా వరుస సినిమాలతో ఎంటర్టైన్ చేస్తుంటాడు నితిన్. గతేడాది ఏకంగా మూడు సినిమాలతో అభిమానులను పలకరించాడు. అయితే అందులో ఏ ఒక్కటి కూడా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో నితిన్ ఆశలన్ని ‘మాచర్ల నియోజకవర్గం’ పైనే ఉన్నాయి.ప్రముఖ ఎడిటర్ ఎమ్.ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మొదటి సారిగా నితిన్ పూర్తి స్థాయి మాస్ యాక్షన్ చిత్రంలో నటించాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసాయి. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 12న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుసగా అప్డేట్లను ప్రకటిస్తూ ప్రేక్షకులలో క్యూరియాసిటిని పెంచుతున్నారు.
మాచర్ల నియోజకవర్గం ట్రైలర్ శనివారం విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ ట్రైలర్‌కు సర్వం సిద్ధం అంటూ మాస్ ప్రోమోను విడుదల చేశారు. ఇక ఇటీవలే విడుదలైన గ్లింప్స్ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచింది. ప్రేమకథా చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్‌గా ఉండే నితిన్ ఈ సారి అవుట్ అండ్ అవుట్ మాస్ కథతో రానుండటంతో ప్రేక్షకులలో విపరీతమైన క్యూరియాసిటీ ఏర్పడింది. నితిన్ ఈ చిత్రంలో గుంటూరు జిల్లా కలెక్టర్‌గా కనిపించనున్నాడు. కృతిశెట్టి, క్యాథెరీన్ థ్రెసా హీరోయిన్లుగా నటించారు. ఆదిత్య మూవీస్ &ఎంటర్టైనమెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్లపై ఎన్.సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి స్వరాలను సమకూర్చాడు. ఇప్పటికే విడుదలైన ‘రా రా రెడ్డి’ యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.
#MacherlaNiyojakavargam TRAILER Launch Celebrations ki anthaa siddham! 🤘🏻🤩
🗓️ Tomorrow, July 30th from 6PM
📍 LEM School Ground, Brodipet, Guntur@actor_nithiin @IamKrithiShetty @SrSekkhar @SreshthMovies #MahathiSwaraSagar @adityamusic @shreyasgroup#MNVFromAUG12th pic.twitter.com/9xkpW3NnH5— Shreyas Media (@shreyasgroup) July 29, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

