Nithin|పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల దగ్గర నుండి వాటిని దొంగిలించాలని అనుకుంటున్నా.. నితిన్ షాకింగ్ కామెంట్స్
Nithin|యంగ్ హీరో నితిన్ ఇప్పుడు మంచి హిట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన నుండి కొన్నాళ్లుగా ఒక్క హిట్ కూడా రాలేదు. ప్రస్తుతం నితిన్
Nithin|యంగ్ హీరో నితిన్ ఇప్పుడు మంచి హిట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన నుండి కొన్నాళ్లుగా ఒక్క హిట్ కూడా రాలేదు. ప్రస్తుతం నితిన్ రాబిన్ హుడ్ మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ చిత్రంగా రూపొందగా, ఈ మూవీని వెంకీ కుడుముల తెరకెక్కించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేయగా, జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మార్చి 28న థియేటర్స్‌లోకి రానుంది ఈ చిత్రం.
అప్పట్లో వెంకీ కుడుముల తెరకెక్కించిన భీష్మ సినిమా తర్వాత నితిన్‌కి చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేదు.మళ్లీ తన కెరీర్ గాడిలో పడాలంటే వెంకీ కుడుముల అయితేనే కరెక్ట్ అనుకున్నారేమో ఏమో కాని ఆయనతో రాబిన్‌హుడ్ సినిమా చేయగా, ఈ సినిమాకి సంబంధించిన అన్నీ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో చాలా బిజీగా ఉన్నారు. కెరీర్లో పర్ఫెక్ట్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న నితిన్ ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌తో ఉన్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా నితిన్‌కి ఆసక్తికర ప్రశ్నలు ఎదురుయ్యాయి. పలువురు టాలీవుడ్ హీరోల ఫొటోలని చూపిస్తూ వారి నుండి ఏ విషయం దొంగిలించాలని అనుకుంటున్నారు అని నితిన్‌ని ప్రశ్నించగా ఆయన ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు
నాని నుండి ఈగ చిత్రాన్ని తస్కరించాలని అనుకుంటున్నాను. స్క్రిప్ట్ సెలక్షన్ బాగుంటుంది, కాబట్టి దానిని దొంగిలించాలని అనుకుంటున్నాను. ఎన్టీఆర్ నుండి డైలాగ్ డెలివరీ, మహేష్ బాబు నుండి అందం, స్వాగ్, పవన్ కళ్యాణ్ నుండి అన్ని విషయాలు, ప్రభాస్ నుండి ఆయన వ్యక్తిత్వం రాజసం, విజయ్ దేవరకొండ రౌడీ క్యారెక్టర్ తస్కరించాలని అనుకుంటున్నాను అని స్పష్టం చేశారు నితిన్. ఇక శ్రీలీలకి అదే ప్రశ్న ఎదురు కాగా, కాజల్ నుండి కళ్లు, అనుష్క నుండి హైట్, వ్యక్తిత్వం అందిపుచ్చుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు నితిన్. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

