Extra Ordinary Man | టాలీవుడ్ హీరో నితిన్ (Nithiin) నటిస్తున్న తాజా చిత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ (Extra Ordinary Man). నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా(Naa Peru Surya Naa Illu India) ఫేమ్ వక్కంతం వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ మూవీలో శ్రీలీల (Sreeleela) హీరోయిన్గా నటిస్తోండగా.. సీనియర్ హీరో రాజశేఖర్(Rajashekar) కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి సాలిడ్ అప్డేట్ను అందించారు మేకర్స్.
ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 30న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియాలో రాసుకోచ్చారు. దీనితో పాటు నితిన్ కు సంబంధించి కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఇక ఈ పోస్టర్ చూస్తే.. తమ్ముడు (Tammudu) సినిమాలోని వయ్యారి భామ(Vayyari Bhama) సాంగ్‌లో పవన్ కళ్యాణ్ కూలీ గెటప్ ఆధారంగా చేసుకుని డిజైన్ చేసినట్లు ఉంది. ఎందుకంటే ఇందులో పవన్ లా.. నితిన్ కూలీ గెటప్‌లో చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. ఇక ఈ సినిమా డిసెంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని నితిన్ హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్‌పై సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. హరీష్ జయరాజ్ సంగీతమందిస్తున్నారు.
Get ready for a blast of #Extra-Entertainment in just 4 days! 🤩🔥#ExtraTeaser On October 30th #ExtraOrdinaryManOnDec8th@actor_nithiin #Rajasekhar @sreeleela14 @vamsivakkantham@Jharrisjayaraj #SudhakarReddy #NikhithaReddy @SreshthMovies@vamsikaka @adityamusic pic.twitter.com/5OU7d3KjjD
— Sreshth Movies (@SreshthMovies) October 26, 2023