Niharika | ‘రాకాస’ సక్సెస్ మీట్లో నిహారిక కొణిదెల వివాదాస్పద కామెంట్స్… నెట్టింట తెగ ట్రోల్స్
Niharika | మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన తాజా చిత్రం ‘రాకాస’ బాక్సాఫీస్ వద్ద మంచి స్పందనను రాబడుతూ రెండో వారంలోకి విజయవంతంగా అడుగుపెట్టింది. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన ఈ ఫాంటసీ హారర్ కామెడీకి దర్శకురాలు మానస శర్మ. ఏప్రిల్ 3న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ అందుకొని, డీసెంట్ ఓపెనింగ్స్ నమోదు చేసింది.
Niharika | మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన తాజా చిత్రం ‘రాకాస’ బాక్సాఫీస్ వద్ద మంచి స్పందనను రాబడుతూ రెండో వారంలోకి విజయవంతంగా అడుగుపెట్టింది. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన ఈ ఫాంటసీ హారర్ కామెడీకి దర్శకురాలు మానస శర్మ. ఏప్రిల్ 3న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ అందుకొని, డీసెంట్ ఓపెనింగ్స్ నమోదు చేసింది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఇప్పటికే ‘సమ్మర్ ఫన్టాస్టిక్ బ్లాక్‌బస్టర్’ పేరుతో ఒక సక్సెస్ మీట్ నిర్వహించగా, తాజాగా (ఏప్రిల్ 10) ‘బ్లాక్‌బస్టర్ డిస్ట్రిబ్యూటర్స్ సక్సెస్ మీట్’ పేరిట మరో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ ఈవెంట్‌కు నిహారికతో పాటు దర్శకురాలు మానస శర్మ, నటుడు బ్రహ్మాజీ, హీరో సంగీత్ శోభన్, హీరోయిన్ నయన్ సారిక, అలాగే మైత్రీ రవి శంకర్ సహా పలువురు డిస్ట్రిబ్యూటర్లు హాజరయ్యారు.ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ, ‘రాకాస’ సినిమా బ్రేక్ ఈవెన్ అయి, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చిపెట్టిందని తెలిపారు. ప్రేక్షకులు ఇచ్చిన ఆదరణకు కృతజ్ఞతలు తెలుపుతూ, చిత్రబృందంలోని ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇచ్చారు.కలెక్షన్ పోస్టర్ ఎందుకు రిలీజ్ చేయలేదన్న ప్రశ్నకు స్పందిస్తూ, “నంబర్స్ తక్కువగా వచ్చి ఉంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడికి వచ్చేవారు కాదు. రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల నుంచి వచ్చారు అంటే వాళ్లు హ్యాపీగా ఉన్నారన్న మాట. ఎంతకు కొనుగోలు చేశారు, ఎంత లాభం వచ్చింది అన్న లెక్కలు మా చార్టర్డ్ అకౌంటెంట్స్ చూసుకుంటారు” అని ఆమె చెప్పారు.
ఇదే సమయంలో అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్లో రూపొందుతున్న ‘రాకా’ టైటిల్ గురించి కూడా ఆసక్తికర చర్చ జరిగింది. ‘రాకాస’ తర్వాత అదే ఫ్యామిలీ నుంచి ‘రాకా’ అనే టైటిల్ రావడం గురించి అడిగిన ప్రశ్నకు నిహారిక, అది పూర్తిగా కాకతాళీయమే. ఆ టైటిల్ గురించి నాకు ముందుగా ఎలాంటి సమాచారం లేదు. టాప్ సీక్రెట్‌గా ఉంచడంతో మేము కూడా సర్ప్రైజ్ అయ్యాం అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. అయితే ఈ ఈవెంట్లో నిహారిక చేసిన ఒక వ్యాఖ్య వివాదానికి దారితీసింది. కార్యక్రమం ముగిసే సమయంలో ఓ మీడియా ప్రతినిధి మరో ప్రశ్న అడగగా, దానికి సమాధానం దాటవేసే క్రమంలో “అయిపోయింది.. హ్యాపీ అంబేద్కర్ జయంతి” అని వ్యాఖ్యానించారు. అయితే బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14న జరుపుకుంటారన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసందర్భంగా ఆ వ్యాఖ్య చేయడం పై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ‘రాకాస’ సినిమా సక్సెస్‌తో పాటు, నిహారిక వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ డిఐజి ఆఫీస్‌లో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
Rajnath Singh | దేశాన్ని అస్తిర పరిచేందుకు, ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఆందోళనలు.. ఇండియా బ్లాక్‌పై రాజ్‌నాథ్ సింగ్ ఆరోపణ
KTR | ఆంధ్రలో జల పండగ ఎట్లయితది? తెలంగాణలో కరువు ఎందుకుంటది? సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు.. ర్యాలీకి వెళ్లకూడదంటూ నోటీసులు జారీ
Kumbha | ‘కుంభ’లోని శక్తిని ఇప్పుడే తట్టిలేపాలని అనుకోవడం లేదు.. పృథ్వీరాజ్ బర్త్‌డేపై రాజమౌళి ట్వీట్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

