ప్రతి పైసాకూ న్యాయం చేసే సినిమా
‘కొణిదెల ఫ్యామిలీ, పింక్ ఎలిఫెంట్ ఫ్యామిలీ రెండూ నాకు సమానమే. నచ్చింది చేయడానికే నిర్మాతను అయ్యాను. ఫ్రీడమ్ ఇచ్చి ముందుకు నడిపిస్తున్న అమ్మానాన్నకు థాంక్స్ చెబుతున్నా’ అని నిహారిక కొణిదెల అన్నారు. పింక్ ఎలిఫెంట్ పతాకంపై ఉమేష్‌కుమార్ బన్సాల్‌తో కలిసి ఆమె నిర్మించిన తాజా చిత్రం ‘రాకాస’.
‘కొణిదెల ఫ్యామిలీ, పింక్ ఎలిఫెంట్ ఫ్యామిలీ రెండూ నాకు సమానమే. నచ్చింది చేయడానికే నిర్మాతను అయ్యాను. ఫ్రీడమ్ ఇచ్చి ముందుకు నడిపిస్తున్న అమ్మానాన్నకు థాంక్స్ చెబుతున్నా’ అని నిహారిక కొణిదెల అన్నారు. పింక్ ఎలిఫెంట్ పతాకంపై ఉమేష్‌కుమార్ బన్సాల్‌తో కలిసి ఆమె నిర్మించిన తాజా చిత్రం ‘రాకాస’. సంగీత్శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. మానసశర్మ దర్శకత్వం వహించిన ఈ హారర్ కామెడీ మూవీ ఈనెల 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్లో నిహారిక మాట్లాడారు.
సాంకేతికంగా అన్ని విధాలా సినిమా ఆకట్టుకుంటుందని, ‘రాకాస’ సాధించబోయే విజయంలో సింహభాగం క్రెడిట్ సంగీత్శోభన్కే దక్కుతుందని, నయన్సారిక, గెటప్‌శ్రీను అద్భుతంగా నటించారని, ఆద్యంతం వినోదభరితంగా సినిమా ఉంటుందని నిహారిక కొణిదెల నమ్మకం వెలిబుచ్చారు. ‘మేం మంచి సినిమా తీశామని నమ్ముతున్నాం. ప్రేక్షకుడు పెట్టే ప్రతి పైసాకూ ఈ సినిమా న్యాయం చేస్తుంది. ఎవర్నీ నిరాశపరచదు’ అన్నారు సంగీత్శోభన్. నిహారిక తన లక్కీఛార్మ్ అనీ, అద్భుతమైన టీమ్ పనిచేసిన ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని దర్శకురాలు మానసశర్మ నమ్మకం వ్యక్తం చేశారు. ఇంకా నయన్సారిక, గెటప్‌శ్రీను తదితర చిత్రబృందంతోపాటు మైత్రి శశి, జీ స్టూడియోస్ ప్రతినిధి దివ్య విజయ్ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

